పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం

– ఆనందాలు పంచుకున్న ఆనాటి విద్యార్థులు
–  ఆటపాటలతో వేడుకలు
వరంగల్ ఈస్ట్, అక్టోబర్ 17(జనం సాక్షి)
  ఆనాటి హృదయాల ఆనందగీతం ఇదేలే అంటూ 33 ఏళ్ల తర్వాత కలుసుకున్న పూర్వ విద్యార్థులు పాడుకున్నారు.. ఆనాటి స్మృతులను నెమరు వేసుకున్నారు.. ఒకరికి ఒకరు తమ అనుభవాలను పంచుకున్నారు.. ప్రస్తుతం ఎవరెవరు ఏం చేస్తున్నారో తెలుసుకున్నారు.. ప్రతి ఏటా ఇలాగే కలుసుకుందామని అనుకున్నారు.     శ్రీ వెంకటేశ్వర ఫ్రెండ్స్ వెల్ఫేర్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఉరుసులోని శ్రీ వెంకటేశ్వర ఉన్నంత పాఠశాలకు చెందిన 1988 -89 సంవత్సరము 10వ తరగతి విద్యార్థులు ఆదివారం ఉరుసులో ఓ ఫంక్షన్ హాల్ లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. గురువులను సన్మానించారు. ఎవరెవరు ఏ స్థాయిలో ఉన్నారో పరిచయాలు చేసుకున్నారు. అందరూ బాగుండాలని కోరుకున్నారు. కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర ఫ్రెండ్స్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు పుట్ట మోహన్ రావు, మరియు క్లాస్మేట్స్ బైరి పట్టాభి భేతి జనార్దన్ ,కొట్టే సతీష్, పాల శివ, గాదె నర్సింగం, దుంపటి రమేష్, అడ్లగట్ల ఓంకార్, పల్లం రవి, కందగట్ల శోభ, గడ్డం వాని పరికిపండ్ల మాధవి తదితరులు పాల్గొన్నారు.