పెండింగ్ పెన్షన్లు ,కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలి

        సిపిఐ

వనపర్తి:సెప్టెంబర్ 1 (జనం సాక్షి )సాంకేతిక లోపం వల్ల పెండింగ్ లో ఉన్న వృద్ధుల పెన్షన్లు,కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయాలని భారత జాతీయ మహిళా సమాఖ్య (సిపిఐ అనుబంధం)జిల్లా అధ్యక్షులు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పి.కళావతమ్మ,ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులుకే శ్రీరామ్ డిమాండ్ చేశారు.గురువారం వనపర్తిలో వారు విలేకరులతో మాట్లాడారు ఆగస్టు 27న పానగల్ మండలం వివిధ గ్రామాల్లో జిల్లా కలెక్టర్, కొల్లాపూర్ ఎమ్మెల్యే పెన్షన్ల పంపిణీ చేశారని ఈ సందర్భంగా దరఖాస్తు చేసుకున్నా తమకు పింఛన్లు రాలేదని కేతేపల్లి,తెల్ల రాళ్లపల్లి గ్రామాలకు కొందరు వృద్ధులు వారి దృష్టికి తెచ్చారని తెలిపారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న రసీదులను కూడా వారికి చూపించారని తెలిపారు స్పందించిన వారు సమస్య పరిష్కరిస్తామని అర్హులందరికీ పింఛన్లు వస్తాయని ధైర్యం చెప్పారని ,కానీ కదలిక లేదని తెలిపారు.ఇలాగే జిల్లాలో కొన్ని గ్రామాలు సాంకేతిక లోపం వల్ల దరఖాస్తు చేసుకున్నా, పింఛన్లు రాలేదని తెలుస్తోందని తెలిపారు.సాంకేతిక లోపంతో పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను డి ఆర్ డి ఓ, ఎంపీడీవోలు పరిశీలించి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించాలని కోరారు అర్హత గల చాలామంది కొత్తగా దరఖాస్తు కు మీసేవ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారని వెబ్సైట్ తెరచుకోలేదని తెలిసి ఆందోళన చెందుతున్నారని తెలిపారు కొత్త దరఖాస్తులు స్వీకరించి అర్హులందరికీ పింఛన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు అలాగే కొత్త రేషన్ కార్డులు ఆగస్టులో ఇస్తామని ముఖ్యమంత్రి ,మంత్రులు ప్రకటించారని ఇంతవరకు ఇవ్వలేదని పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు ఈ సమస్య ల పై అధికారులు స్పందించకుంటే ఎంపీడీవో కార్యాలయాల వద్ద లబ్ధిదారులతో ఆందోళన తప్పదని హెచ్చరించారు.