పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి

గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర్లు
బిజినేపల్లి. జనం సాక్షి .అక్టోబర్.11.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామపంచాయతీ రంగంలో పనిచేస్తున్న గ్రామపంచాయతీ కార్మికులకు గత రెండు నెలలుగా వేతనాలు చెల్లించకుండా అధికారులు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని దీనిమూలంగా గ్రామపంచాయతీ కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారయిందని కావున పెండింగ్లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మంగళవారం మండల పరిధిలోని వెలుగొండ గ్రామపంచాయతీ ఆవరణంలో పంచాయతీ కార్మికులకు జనరల్ బాడీ సమావేశ నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ  గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమనే పణంగా పెట్టి చాలీచాలని వేతనాలతో పని చేస్తున్నటువంటి గ్రామపంచాయతీ సిబ్బందికి గత రెండు నెలలుగా వేతనాలు పెండింగ్లో ఉన్నాయని వాటిని వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు.ప్రతి 5వ తారీకు లోపు వేతనాలు చెల్లించాలని,ఆదివారం మరియు పండుగ సెలవులు అమలు చేయాలని, ఎస్ఐపిఎఫ్ సౌకర్యం కల్పించాలని, ఉద్యోగ భద్రతతో పాటు నెలకు 26 వేల జీతం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పొదిలి రామయ్య, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ తుమ్మ మహేష్, బిజినపల్లి మండల అధ్యక్షులు వెలిగొండ రాములు మంగనూరు సత్యం లక్ష్మమ్మ శశికళ నాగమణి చిన్నమ్మ అంజయ్య శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు