.‘పెట్టుబడుకు’ కేంద్రం కసరత్తు

` ఆర్ధిక రంగాన్ని వృద్ధిలోకి తీసుకొచ్చేందుకు కేంద్రం ప్రణాళికు

` సంబంధిత అధికారుతో ప్రధాని విస్తృతస్థాయి  సవిూక్ష

` హాజరైన మంత్రు అమిత్‌ షా, మంత్రి నిర్మలా సీతారామన్‌, పీయూష్‌ గోయల్

‌దిల్లీ,ఏప్రిల్‌ 30(జనంసాక్షి): కరోనా మహమ్మారి కారణంగా మందగించిన ఆర్ధిక రంగాన్ని వృద్ధిలోకి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికు సిద్ధం చేస్తోంది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ గురువారం హోంశాఖ మంత్రి అమిత్‌ షా, ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌, వాణిజ్యశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌, సంబంధిత శాఖ అధికారుతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. స్థానికంగా పెట్టుబడును ప్రోత్సహిస్తూనే, భారత్‌లోకి విదేశీ పెట్టుబడు ఆకర్షించేందుకు అనుసరించాల్సిన వ్యూహాపై సమావేశంలో ప్రధానంగా చర్చించారని ప్రధాని కార్యాయం ఒక ప్రకటనలో తెలిపింది. అలానే పెట్టుబడును ఆకర్షించేందుకు అనుసరిస్తున్న విధానాపై రాష్ట్రాకు దిశానిర్దేశం చేయడం గురించి కూడా ఈ సందర్భంగా చర్చించినట్లు ప్రకటనలో పీఎంవో పేర్కొంది. పెట్టుబడు ఆకర్షణకు ఆయా మంత్రిత్వశాఖు అనుసరిస్తున్న విధానాు కొనసాగిస్తూనే పెట్టుబడుకు, పారిశ్రామిక ప్రగతికి అడ్డంకిగా ఉన్నవాటిని తొగించే విధంగా చర్యు తీసుకోవాని సమావేశంలో నిర్ణయించారు. ప్రస్తుతం దేశంలో ఉన్న పరిశ్రమ భూము, ప్లాట్లు, ఎస్టేట్‌లో ప్లగ్‌ అండ్‌ ప్లే సదుపాయాు కల్పించేందుకు ఆర్థికపరమైన సహాయ సహకారాు అందించేందుకు అవసరమైన పథకా రూపక్పన చేయడంపై కూడా చర్చించారు.  పెట్టుబడిదారు సమస్యను వెంటనే పరిష్కరించి, వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా నుంచి రావాల్సిన అనుమతును వెంటనే మంజూరు చేసే విధంగా చర్యు తీసుకోవాని ప్రధాని మోదీ సంబంధిత శాఖకు సూచించారు. ‘‘దేశ వృద్ధిని వేగవంతం చేసే జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడును ప్రోత్సహించేందుకు భారత్‌ అనుసరించాల్సిన విధానాపై చర్చించడం జరిగింది’’ అని ప్రధాని మోదీ సమావేశం అనంతరం ట్విటర్లో వ్లెడిరచారు.