*పెద్దేముల్ లో ఉవ్వెత్తున ఎగిసిపడిన జాతీయత భావం…*

పెద్దేముల్ ఆగస్టు 17( జనం సాక్షి)
భారత్ మాత కి జై , వందేమాతరం నినాదాలతో  పెద్దేముల్ మార్మోగింది.
బుధవారం నాడు పెద్దేముల్ మండల కేంద్రంలో స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు కావస్తున్నా సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా సూచించబడిన ఆజాది కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ఏబీవీపీ తాండూర్ ఆధ్వర్యంలో నిర్వహించిన తిరంగా యాత్ర కార్యక్రమాన్ని పురస్కరించుకుని భారీ తిరంగాతో పెద్దేముల్ ప్రధాన విధుల గుండా తిరంగా యాత్ర నిర్వహించారు. కుల మత వర్గ లింగ వర్ణ బేధాలు లేకుండా జాతి మొత్తం ఒక్కటే అనే నినాదంతో  ఐక్యతను చాటారు. పెద్దేముల్ చరిత్రలోనే మొట్ట మొదటిసారిగా జరిగిన అత్యద్భుతమైన తిరంగా యాత్ర నిర్వహించారు.
ఇట్టి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పెద్దేముల్ ఎస్సై రవుఫ్ హాజరైనారు. ముఖ్య వక్త గా ఆర్ఎస్ఎస్ ఖండ బౌద్ధిక్ ప్రముఖ్ అశోక్,ప్రభుత్వ కళాశాల,ప్రభుత్వ పాఠశాల అధ్యాపకుల బృందం ,విద్యార్థి బృందం వ్యవహరించారు.ఈ సందర్భంగా భారత స్వాతంత్ర సంగ్రామంలో నాయకులు చేసిన సేవలను కొనియాడారు.
ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర సోషల్ మీడియా
 కో కన్వీనర్  ఉప్పల రాజేష్ , రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మౌనేశ్వర్ చారి,తాండూరు కార్యదర్శి మని కొండల్ రెడ్డి,సహాయ కార్యదర్శి వినోద్, సోషల్ మీడియా కన్వీనర్ నవీన్ గౌడ్,ఏబీవీపీ పూర్వ కార్యకర్త యాదయ్య గౌడ్ , శివ ,పవన్,రాఘవేంద్ర,మహేష్, శివ ప్రసాద్,శ్రీకాంత్,అమర్నాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.