పెన్షనర్లకు కార్డులు అందజేసిన ఉప సర్పంచ్ ఫోరమ్ నియోజకవర్గ అధ్యక్షులు తట్టు నారాయణ
జహీరాబాద్ సెప్టెంబర్ 21 (జనం సాక్షి )జహీరాబాద్ మండలంలోని ఆనెగుంట గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ముద్రించిన కార్డులను నియోజకవర్గ ఉప సర్పంచుల ఫోరమ్ అధ్యక్షులు తట్టు నారాయణ యాదవ్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
ముఖ్యమంత్రి కెసిఆర్ హయాంలోనే పేదలకు గుర్తింపు లబించిందని గత ప్రభుత్వాలు పేదలను ఎంత మాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసాయన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి ఇంతవరకు స్థానిక ఎమ్మెల్యే కే. మాణిక్ రావు ఆద్వర్యంలో జహీరాబాద్ నియోజవర్గానికి 8140 ఎనిమిది వేయిల ఒక వంద నలభై మంది వితంతువులకు, వృద్ధులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు పెన్షన్ మంజూరి చేయించి లబ్ధిదారులకు గ్రామ గ్రామానికి వెళ్ళి స్వయంగా స్థానిక శాసన సభ్యులు కొనింటి మానిక్ రావు అందజేయడం శుభ పరిణామం అని తట్టు నారాయణ యాదవ్ తెలిపారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు గొల్ల జగన్నాథం, మండల కో ఆప్షన్ మొయినోద్దీన్ ,టిఆర్ఎస్ పార్టీ మండల యువత నాయకులు మహేష్ , వెంకటి లక్ష్మణ్ సమ్మన్న, పంచాయతీ సెక్రటరీ భీమ్ రావ్ , గ్రామస్తులు పార్టీ నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.