పెన్షన్ కోసం పోరు
పలిమెల, ఆగస్ట్ 05 (జనంసాక్షి)
డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు పలిమెల మండల కమిటీ ఆధ్వర్యంలో పెన్షన్ పోరు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా దాదాపుగా 50 నుంచి 60 మంది వివిద రకాల పెన్షన్లకు అప్లికేషన్లు పెట్టుకోగా ఇంతవరకు ఇవ్వలేదని ఆరోపించారు. ఇదే విషయాన్ని ప్రజప్రతినిధులను ఎప్పుడు ప్రశ్నించినా తొందర్లోనే వస్తాయని చెప్పడం అలవాటైందని అన్నారు. మండలంలో భర్త చనిపోయి పది సంవత్సరాలైనా పించన్ రాని వాళ్లు ఉన్నారని అన్నారు. బిఎస్పి మంథని నియోజకవర్గ ఇంచార్జ్ కందుగుల రాజన్న మాట్లాడుతూ అర్హులైన అందరికి పించన్ మంజూరు అయ్యేవరకు బిఎస్పి పార్టీ మీ వెంట ఉంటదని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ కల్గూరి వెంకట్, మండల జనరల్ సెక్రెటరి జనగాం రామ్మూర్తి, మండల సెక్టర్ అధ్యక్షులు తోలెం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.