పెరిగిన జీవన వ్యయం నేపథ్యంలో విఆర్ ఏల డిమాండ్లను నెరవేర్చాలి

రుద్రూర్ (జనంసాక్షి)
తమ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నెల 25 నుంచి సమ్మె చేపట్టనున్నట్లు తెలంగాణ వీఆర్ఏల జేఏసీ ప్రకటించింది. దీనిలో భాగంగానే రుద్రూర్ తహశీల్ధార్ కార్యాలయం వద్ద విఆర్ ఏ లు తమ డిమాండ్లను నెరవేర్చాలని చేస్తున్న నిరసనకు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు
ఇందూర్ చంద్రశేఖర్ మండల నాయకులు మరియు కార్యకర్తలతో కలిసి కాంగ్రెస్ పార్టీ తరుపున సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని రోజులు గా విఆర్ఏలు తమ హక్కులకోసం చేస్తున్న నిరసనకు న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని .ఇది వారు అడుగుతున్న డిమాండ్ల కావు అని సీఎం ఇచ్చిన డిమాండ్లనే వారు అడుగుతున్నారని వారు అడిగే పే స్కేల్, తండ్రుల స్థానంలో అర్హులైన పిల్లలకు జాబ్, అర్హత ఉన్నవారికి పదోన్నతి ఇవ్వాలని, పెరిగిన జీవన వ్యయం నేపథ్యంలో వీరంతా అర్ధాకలితో జీవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఇందూరు చంద్ర శేఖర్,తోట అరుణ్ కుమార్, పార్వతి ప్రవీణ్, ఇందూరు కార్తీక్, కాసుల మహేష్,మాశెట్టి శ్రీనివాస్, నిస్సార్, గాండ్ల సాయిలు, గాండ్ల శ్రీనివాస్, నగేష్, రవి, తదితరులు పాల్గొన్నారు.