పెళ్లి చేసుకోబోతోన్న కౌర్నికోవా
పాప్‌స్టాప్ ఎన్రిక్‌తో వచ్చే వారం వివాహం
లండన్ ,మే 7 (జనంసాక్షి) :
మాజీ టెన్నిస్ ప్లేయర్ అన్నా కౌర్నికోవా ఎట్టకేలకు పెళ్ళి చేసుకోబోతోంది. దాదాపు 12 ఏళ్ళుగా స్పానిష్ పాప్‌స్టార్ ఎన్రిక్ ఇగ్లెసియాస్‌తో చేస్తోన్న డేటింగ్‌ను పూర్తి బంధంగా మార్చుకోబోతోంది. వచ్చే వారం వీరిద్దరూ వివాహం చేసుకుంటున్నట్టు ఆమె సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. వరల్డ్ టెన్నిస్‌లో మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేయర్‌గా గుర్తింపు పొందిన కౌర్నికోవా 2007లోనే రిటైర్మెంట్ ప్రకటించింది. అయితే ఆటలో కొనసాగుతున్నప్పటి నుండే ఎన్రిక్‌తో లవ్ ఎఫైర్ నడిపింది. ఎప్పటికప్పుడు వీరిద్దరూ పెళ్ళి చేసుకుంటారని వార్తలు వచ్చినా… అది నిజయం కాలేదు. అయితే తమ 12 ఏళ్ళ లవ్‌స్టోరీకి ఇప్పుడు పెళ్ళితో ముగింపు పలుకుతున్నారు. దీనికి సంబంధించిన వివరాలు గోప్యంగా ఉంచినప్పటకీ… పలువురు సెలబ్రిటీలు వీరి వివాహానికి హాజరు కానున్నట్టు తెలుస్తోంది. నికోల్ షెర్జింగర్, లూయీస్ హామిల్టన్, జెన్నిఫర్ లోపెడ్, డేవిడ్ బెక్ హామ్, విక్టోరియా బెక్ హామ్ వంటి స్టార్లను ఇప్పటికే ఈ జంట ఆహ్వానించినట్టు సమా చారం. కొన్నేళ్ళ క్రితమే వీరి ఎంగేజ్‌మెంట్ కూడా జరిగింది. దాదాపు 3 మిలియన్ పౌండ్ల ధర కలిగిన డైమండ్ రింగ్‌ను కౌర్నికోవా తన చేతికి ధరించింది. 2011లో వీరిద్దరూ రహస్యంగా పెళ్ళి చేసుకున్నట్టు వార్తలు వచ్చినా వారు ఖండించారు. అందరికీ చెప్పే చేసుకుంటామని తెలిపారు. వివాహం జరిగిన తర్వాత భారీ ఎత్తున రిసెప్షన్ కూడా ఏర్పాటు చేసేందుకు ఈ పెయిర్ సిధ్దమవుతోంది.హరిస్తోంది. మరి చెన్నై టీంకు మాత్రం అలా బ్రాండ్ అంబాసిడర్లు అంటూ ఎవరూ లేరు. అందుకు ప్రధాన కారణ