పెళ్లి వ్యాను బోల్తా : ఏడుగురి మృతి
వరంగల్ : వరంగల్ జిల్లా భూపాలపల్లిలో పెళ్లి బృందంతో వెళ్తున్న డీసీఎం వ్యాను బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతిచెందినట్లు సమాచారం మరో 20 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. బుద్దారంనుంచి దంతాలపల్లిలో పెళ్లికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.