*పేకాటరాయులకు నారాయణఖేడ్ పోలీసు వారి విజ్ఞప్తి
జనం సాక్షి
*నారాయణఖేడ్ డివిజన్ పరిధిలో దీపావళి పండుగ సందర్బంగా పేకాట ఆడి పట్టుబడితే జైలుకె దీపావళి పండుగ సందర్భంగా ఎవరైనా పేకాట ఆడిన ఆడించిన కఠిన చర్యలు ఉంటాయని డిఎస్పీ బాలాజీ తెలిపారు డివిజన్ పరిధిలోని అన్ని గ్రామ పంచాయితీ పరిధిలోని గ్రామాలకు, తాండాలకు ఇది వర్తిస్తుంది. ఎక్కడైనా బహిరంగ ప్రదేశాల్లో లేక ఇళ్లల్లో వ్యవసాయ బావుల వద్ద, దుకాణ సముదాయాల్లో ఎవరైనా పర్సనల్ గా పేకాట క్లబ్లను ఏర్పాటు చేసిన వారిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. ఎవరి స్థలంలోనైనా యజమానికి తెలియకుండా అడితే పోలీస్ వారికి తెలియజేయాలి,లేకుంటే వారి పైన కూడా కేసు నమోదు చేసి జైల్ కు పంపించడం జరుగుతోందన్నారు. ఎక్కడైనా నివాస స్థలాలకు దూరంగా కాల్వల్లో చెట్ల పొదల్లో ఆడినట్లయితే పోలీస్ వారికి తెలియజేయాలని తెలియజేసిన వారి పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతోందన్నారు పేకాట ఆడి ఇల్లు గుల్ల చేసుకోవడం భార్యా పిల్లలతో గొడవలు పడడం పచ్చని సంసారాన్ని రోడ్డున పడేయడం అప్పులపలై సంసారాన్ని సర్వనాశనం చేసుకోవడం జరుగుతోందని ఇలాంటి వాటిని అరికట్టడానికె ఈ చర్యలు తీసుకోవడం జరుగుతుందని నారాయణఖేడ్ ఇంచార్జి డిఎస్పీ బాలాజీ తెలిపారు.