పేదల ఆకలి తీర్చేందుకు ఆస్తులు అమ్మిన ముస్లిం సోదరులు

తమకున్న రూ.25 లక్షల సొమ్ముతో దినసరి కూలీలకు నిత్యావసరాలు అందించిన తాజమ్ముల్ పాశా, మజమ్మిల్ పాశాలు |

బెంగుళూరు,ఏప్రిల్ 26(జనంసాక్షి): రాష్ట్రంలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఓ ఇద్దరు అన్నదమ్ములు తమ దాతృ త్వాన్ని చాటుకున్నారు. లా డౌన్ కారణంగా ఇ బ్బందులు ఎదుర్కొంటున్న దినసరి కూలీత్యావసరాలను అందించటానికి సొంత స్థలాన్ని అ మ్మారు. వివరాల్లోకి వెళితే.. కోలార్ జిల్లాకు చెం దిన అన్నదమ్ములు తాజమ్ముల్ పాశా, మజమ్మిల్ పాశాలు లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలకు ఆస్తుల అమ్మిన ముస్లిం సోదరులు సహాయపడాలనుకున్నారు. తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న దినసరి కూలీల కుటుంబాలను చూసి వారు చలించిపోయారు. వీలైనంత త్వరగా వారిని ఆదుకోవాలనుకున్నారు. ఇందుకోసం తమకు చెందిన స్థలాన్ని అమ్మి డబ్బు రూ. 25 లక్షలు సమకూర్చారు. ఆ డబ్బుతో వారికి అవసరమైన నిత్యావసరాలను కొని అందించారు. అంతేకాకుండా అన్నార్డుల కోసం భోజన పొట్లాలు పంచే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ.. ” మా చిన్నప్పుడే తల్లిదండ్రులు మరణించారు. అప్పుడు మేము కోలా లోని మా అమ్మమ్మ గారి ఇంటికి వచ్చేశాము. ఆ సమయంలో మా మతంతో సంబంధం లేకుండా.. హిందువులు, సిక్కులు, ముస్లింలు మాకు సహాయం చేశారు. కడు పేదరికంలో పెరిగాము. అన్ని వర్గాల ప్రజల అండదండల తోటే మేము బ్రతికామ”ని తెలిపారు.