పేదల ఆరోగ్యానికి సీఎంఆర్ఎఫ్ అండ.

ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం తొలి ప్రాధాన్యత.
మున్సిపల్ వైస్-చైర్ పర్సన్ పట్లోళ్లదీపనర్సింలు.
తాండూరు జూన్ 15(జనంసాక్షి) పేదల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి సహాయనిది అండగా
ఉందని మున్సిపల్ వైస్-చైర్ పర్సన్ పట్లోళ్లదీపనర్సింలు పేర్కొన్నారు. మంగళవారం
తాండూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సహకారంతో మంజూరైన ఐదు గురు లబ్దిదారులు ఇందిరానగర్,సాయి పూర్,సీతారంపేట్,ఇంద్రనాగర్,మాల్ రెడ్డిపల్లి కి చెందిన లబ్ధిదారులకు సదానంద్ ,కాజా ,లక్ష్మీ, సురేష్,కాంసమ్మలకు 1,80,000/- రూపాయల విలువగల సీఎంఆర్ఎఫ్ చెక్కులను మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్లదీపనర్సింలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పాలనలో నిరుపేద కుటుంబాల్లో వెలుగులు నింపుతుందన్నారు. నిరుపేద కుటుంబాలు వైద్య ఖర్చులు నిమిత్తం అప్పులు చేసి అనేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా నగదు మంజూరు చేసి  భరోసా కల్పిస్తున్నారని పేర్కొన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి  చేయని విధంగా అభివృద్ధి సంక్షేమాన్ని సీఎం కేసీఆర్ అతి తక్కువ కాలంలోనే చేసి చూపిస్తున్నారని తెలిపారు.పేదల సంక్షేమమే ధ్యేయంగా  టిఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తుంందన్నారు.