పేదల సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం అహర్నిశలు కృషి
– జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి
చేర్యాల (జనంసాక్షి) ఆగస్టు 27 : పేదల సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు. శనివారం చేర్యాల మండల కేంద్రంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి పర్యటించారు. జనగామ నుండి దుద్దెడ క్రాసింగ్ వరకు కేంద్ర ప్రభుత్వ నిధుల నుండి 438 కోట్ల రూపాయలతో మంజూరైన ప్రధాన రహదారి రోడ్డును వెంటనే నిర్మించాలని డిమాండ్ చేస్తూ స్థానిక గాంధీ చౌక్ వద్ద ప్రధాన రహదారి దిగ్బందించి ధర్నా చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అనంతరం మండల కేంద్రంలో లబ్ధిదారులకు ఆసరా పెన్షన్ తో పాటు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా చేర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సుంకరి మల్లేశం గౌడ్, ఎంపీపీ ఉల్లంపల్లి కర్ణాకర్, జడ్పీటిసీ శెట్టె మల్లేశం, మున్సిపల్ చైర్మన్ అంకుగారి స్వరూపారాణి-శ్రీధర్ రెడ్డి టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఊళ్లేంగల ఏకానందం, ముస్త్యాల బాలనర్సయ్య లు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలు జనగామ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోని గ్రామ స్థాయికి చేరే విధంగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం కోసమే అహర్షలు కృషి చేస్తుందన్నారు. ప్రతిపక్షాలు ఆరోపణలు చేసి ఎన్ని అడ్డంకులు వేసినా రానున్న కాలంలో మళ్ళీ టీఆర్ఎస్ దే విజయమని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు,తదితరులు పాల్గొన్నారు.