పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం పని చేస్తోంది.

మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి.

సిరిసిల్ల. అక్టోబర్ 13.(జనం సాక్షి). పేదల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి అన్నారు. గురువారం డబల్ బెడ్ రూమ్ లబ్ధిదారులకు మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య అధ్యక్షతన సినారె కళామందిర్ లో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో పట్టాలను అందజేశారు. సమావేశానికి హాజరైన మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను అందిస్తుందని అన్నారు. నిరుపేదలు ఆత్మగౌరవంతో జీవించడం కోసం వారి సొంతింటి కలను సాకారం చేసేందుకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించి ఇస్తోందని అన్నారు. మిగిలిన వారికి త్వరలోనే అందజేస్తామని తెలిపారు. డ్రా లో రాణి వారు ఆందోళన చెందవద్దని ప్రభుత్వం వారికి తగిన విధంగా అందిస్తుందని అన్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ మంచే శ్రీనివాస్ మాట్లాడుతూ పేదలకు ప్రభుత్వం అండగా నిలబడుతుందని తెలిపారు. కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్లు కోఆప్షన్ సభ్యులు లబ్ధిదారులు పాల్గొన్నారు