*పేద కుటుంబానికి పిల్లుట్ల రఘు అన్న చేయూత*

*హుజూర్నగర్ ఓజో ఫౌండేషన్ ఇన్చార్జ్  :-కుక్కల వెంకన్న*

మేళ్లచెరువు మండలం (జనం సాక్షి న్యూస్)

*మేళ్లచెరువు  మండలం మాధవరం   గ్రామానికి చెందిన కుక్కల లచ్చయ్య  గారు అనారోగ్య కారణాలతో మృతి చెందారు. లచ్చయ్య   నిరుపేద కుటుంబానికి చెందిన వాడు కావడంతో చింతిస్తున్న కుటుంబానికి రఘు అండగా నిలిచారు. ప్రతి గ్రామంలో పేదింటి గడప గడపకు ఓజో ఫౌండేషన్ సేవలు అందిస్తున్నారని తెలుసుకున్న గ్రామస్తులు,ఓజో ఫౌండేషన్ సభ్యులకు సమాచారం అందించారు. వారి కుటుంబ పరిస్థితులను తెలుసుకున్న గ్రామ ఫౌండేషన్ సభ్యులు. ఫౌండేషన్ ఇంచార్జి కుక్కల వెంకన్నకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న వెంకన్న,  ఓజో ఫౌండేషన్ చైర్మన్ పిల్లుట్ల రఘు అన్న కు తెలియజేయగా  వెంటనే స్పందించి అదివారం బాధిత కుటుంబాన్ని పరామర్శించి 50 కేజీల బియ్యం రూ 5వేల ఆర్థిక సాయం అందజేసినట్లు ఇంచార్జ్ కుక్కల వెంకన్న వెల్లడించారు. ఇలా ప్రతి గ్రామంలో గడపగడపకు పెద్ద కొడుకుల తన సేవలు అందించాలని వారు ఈరోజు ఓజో ఫౌండేషన్ ని స్థాపించి సేవలందిస్తున్నారని తెలిపారు కుక్కల వెంకన్న  మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా రఘు అన్న   గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఈ సేవా కార్యక్రమంలో  భాగంగానే మాదారం గ్రామంలో ఈ రోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది రాబోయే  రోజుల్లో మరెన్నో  సేవా కార్యక్రమాలు చేసే విధంగా     పనిచేస్తామని తెలియజేశారు  ఈ  కార్యక్రమంలో ఓజో ఫౌండేషన్ ఇంచార్జి  కుక్కల వెంకన్న గ్రామ పెద్దలు రజాక్,శంకర్, పెద్దగట్టు,జాన్, శివశంకర్,సైదులు,సునీల్,సైదాచారి*,*గ్రామస్తులు మహిళలు,తదితరులు పాల్గొన్నారు*