పేద ప్రజలకు ఆర్థిక భరోసాగా సీఎం సహాయ నిధి
అలంపూర్ శాసన సభ్యులు డాక్టర్.వి.యం.అబ్రహంఅలంపూర్ జనంసాక్షి (అక్టోబర్ 12) పేద ప్రజలకు ఆర్థిక భద్రత కల్పించడమే సీఎం సహాయనిధి లక్ష్యమని అలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహం అన్నారు.
బుధవారం అలంపూర్ చౌరస్తా లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఐజ ,రాజోలి ,మానవపాడు,ఉండవల్లి, వడ్డేపల్లి ,ఇటిక్యాల ,రాజోలి అలంపూర్ మండలాల వారికి సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన 17 మంది లబ్ధిదారులకు 4,46,500 /- లక్షల రూపాయిలు గల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ
అభాగ్యులకు అండగా సీఎం కేసీఆర్ సహాయ నిధి మంజూరు చేస్తున్నారు అని ఆయన అన్నారు.పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు, ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేయడం జరిగింది అని ఆయన గుర్తు చేశారు.సీఎం సహాయ నిధి పేద ప్రజలకు వెలుగులు నింపుతుంది అన్ని అన్నారు.ఆపదలో సీఎం సహాయ నీది ఆపద్భందువునిగ అదుకుంటుంది అని ఆయన తెలిపారు.
మానవతా దృక్పథంతో సీఎం కేసీఆర్ దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి ఆర్దిక సహాయాన్ని మంజూరు చేస్తున్నారని అన్నారు.
వైద్య చికిత్స చేసుకోలేక ఆర్దిక ఇబ్బందులు పడుతున్న ఎ నో కుటుంబాలకు ఈ ఫండ్ ఆసరాగా నిలుస్తుంది,బాధితులు అవసరమైన సమయంలలో సీఎం రిలీఫ్ ఫండ్ ను సద్వినిమెాగపర్చుకొవాలి అని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో అలంపూర్ మునిసిపల్ చైర్మన్ మనోరమ, ధర్మవరం సర్పంచ్ మధు నాయుడు, ఉదండపురం సర్పంచ్ భర్త దానం లతో పాటు వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, మరియు టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.