పేద ప్రజల సంక్షేమమే ప్రధాన ఆశయం: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

మోమిన్ పేట జులై 27( జనం సాక్షి)
 పేద ప్రజల సంక్షేమమే కెసిఆర్ ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పేర్కొన్నారు బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వికారాబాద్ నియోజకవర్గం, లోని మోమిన్ పేట్ మండలాలకు చెందిన లబ్ధిదారులకు మంజూరైన 6,60,000 ఆరు లక్షల అరవై వేలువిలువ గల 14 చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ పంపిణి చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పేద ప్రజల సంక్షేమం ముఖ్య ఉద్దేశం దిశగా పాలన సాగిస్తున్నారు నిరుపేదలు అనారోగ్యా ల బారిన పడి ఇబ్బందులు ఎదుర్కోవద్దని లక్ష్యంతో ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ద్వారా కార్పొరేట్ వైద్యం అందించేందుకు ఈ పథకం ఎంతో దోహదపడుతుందన్నారు
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పటేల్ శ్రీకాంత్ గౌడ్ మోమిన్ పేట పిఎసిఎస్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి మండల ఎంపీటీసీల సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షులు డబ్బాని వెంకట్ సర్పంచులు అంజయ్య యాదవ్ కృష్ణ యాదవ్ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.