పైరవీలు లేని ఉత్తమఉపాధ్యాయులు మీరు

1

– సర్కారీ స్కూళ్లను బలోపేతం చేయడంలో అధ్యాపకులదే కీలకపాత్ర

– డిప్యూటీ సీఎం కడియం

హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 8(జనంసాక్షి):వచ్చే ఉపాధ్యాయ దినోత్సవం నాటికి ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికలో ఎలాంటి దరఖాస్తులకు పైరవీలకు తావులేకుండా చేస్తామని తెలంగాణ డిప్యూటి సిఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ప్రకటించారు. ప్రభుత్వమే నేరుగా ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపికచేసే కార్యాక్రమాన్ని చేపడుతుందన్నారు. ఇది ఇతరలుకు కూడా ఆదర్శంగా ఉండేలా చూస్తామని అన్నారు. నగరంలోని రవీంద్రభారతిలో గురుపూజోత్సవ కార్యక్రమాన్ని నేడు ఘనంగా నిర్వహించారు. సెప్టెంబర్‌ 5న నిర్వహించాల్సిన కార్యక్రమాన్ని వినాయకచవితి సందర్బంగా ఈ రోజుకు మార్చారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి శ్రీహరి స్పందిస్తూ.. ఇవాళ ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం. ఉపాధ్యాయుడి నుంచి రాష్ట్రపతి వరకు ఎదిగిన మహనీయుడు సర్వేపల్లి రాధాకృష్ణ అని అన్నారు. ఉపాధ్యాయుల పనితీరుతోనే ఉత్తమ అవార్డులు వరిస్తాయి. ఉపాధ్యాయులు మరితం కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న మౌలిక వసతులు ప్రైవేట్‌ పాఠశాలల్లో లేవు. క్వాలిఫైడ్‌ టీచర్లు కూడా అక్కడ లేరన్నారు. అయినా తల్లిదండ్రులు అప్పులు చేసి మరీ తమ పిల్లలను ప్రైవేట్‌ పాఠశాలలకు పంపిస్తున్నారని అన్నారు. దీనిపై టీచర్లు ఆలోచన చేయాలన్నారు.

అందరి భాగస్వామ్యంతో బంగారు తెలంగాణను సాధించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి పాఠశాలలో మళిక వసతుల కల్పనకు ప్రభుత్వం శ్రద్ద పెడుతోందన్నారు. పాఠశాలలకు ఎమ్మెల్యే నిధుల నుంచి కొంత ఇవ్వాలని తాను లేఖలు రాశానని అన్నారు. స్కూళ్లో ఊడ్వడానికి, గంటకొట్టడానికి ఇబ్బందులు ఉన్నాయని తెలుసన్నారు. అయితే టీచర్లు సరిగా రారన్న అపప్రథ ఉందన్నారు. దీనిని చెరిపేసి మళ్లీ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్తులు చదువుకునేలా చేయాలన్నారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ,ఎంపీ కే.కేశవరావు, ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ పాపిరెడ్డి, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి దత్తాత్రేయ మాట్లాడుతూ గురుపూజోత్సవం జరుపుకోవడం గొప్ప సాంప్రదాయమన్నారు. విద్య.. వ్యాపారం కావొద్దని దత్తాత్రేయ అన్నారు. విద్యార్థులకు బుద్ది, జ్ఞానం, సంస్కారం నేర్పే వ్యక్తి గురువు అని అన్నారు. విద్య.. వ్యాపారం కావొద్దు ఆయన ఆకాంక్షించారు. గురువ అన్న పదం మరెక్కడా లేదన్నారు. గురువ అంటే విజ్ఞానం అందించేవాడని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం తన అదృష్టంగా భావించారు. దేశాభివృద్ధిలో ఉపాధ్యాయులదే కీలకపాత్ర అని టీఆర్‌ఎస్‌ ఎంపీ కేకే అన్నారు. ఈ సందర్బంగా ఎంపికైన టీచర్లకు అవార్డులను అందచేసి సత్కరించారు.