పొనుగోడు వాసి కి జేఎన్టీయూ హైదరాబాద్ డాక్టరేట్
గరిడేపల్లి, సెప్టెంబర్ 11 (జనం సాక్షి): పొనుగోడు గ్రామంలోని కట్ట చిన్నప్ప సువర్ణల పెద్ద కుమారుడు కట్ట సునంద్ కు డాక్టరేట్ లభించిందని తెలిపారు. డాక్టర్ కృష్ణమోహన్ వసుధ పర్యవేక్షణలో అమెలియెరెటివ్ ఎఫెక్ట్ ఆఫ్ ప్రో బయోటిక్ సప్లిమెంటేషన్ ప్రనేటల్ ఆటిజం ఇండ్యూస్ట్ బై వాల్ ప్రోయిక్ ఆసిడ్ ఇన్ కాన్సింగుయినియస్ ఫ్యామిలీ ఆఫ్ ర్యాట్స్ అనే అంశంపై ఫార్మసూటికల్ సైన్స్ నందు పరిశోధన చేసినందుకు గాను జేఎన్టీయూ హైదరాబాద్ ఆయనకు డాక్టరేట్ బహుకరించిందని తెలిపారు. ఇందుకు సహకరించిన గైడ్స్ పేరెంట్స్ కుటుంబ సభ్యులు ఫ్రెండ్స్ తోటి అనురాగ్ యూనివర్సిటీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం అనురాగ్ యూనివర్సిటీ ఘట్కేసర్ లో అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడని తెలిపారు. సునంద్ తండ్రి కట్టప్ప గడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ గా తల్లి సువర్ణ ప్రధానోపాధ్యాయులు గా పనిచేస్తున్నారు.