పొలం పనులకు వెళ్లాలంటే నరకయాపన తప్పదు

ఆవేదన చెందుతున్న

ఆవేదన చెందుతున్న ధర్మాపూర్ గ్రామస్తులు
మోమిన్ పేట ఆగస్టు 20( జనం సాక్షి)
పొలం పనులకు వెళ్లాలంటే ప్రతినిత్యం నరకయాపన తప్పడం లేదని ధర్మ పూర్ గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు వర్షాకాలం వచ్చిందంటే పొలం పనులు ఇప్పుడిప్పుడే ఉంటాయి కావున రైతులు పొలాలకు వెళ్ళలేని పరిస్థితి దాపురించింది  మండలంలోని ధర్మాపూర్ గ్రామ శివారులోని వ్యవసాయ పొలాలకు వెళ్లాల్సిన రహదారి అది దీనికి తోడు అదే దారిలో స్మశాన వాటిక నిర్మించారు దీంతో మోకాల్లోతో బురదలో వెళ్లాలంటే ప్రతినిత్యం నరకయాపన అనుభవిస్తూ వెళ్లాల్సిందే దీంతో గ్రామస్తులు అధికారులకు ప్రజాప్రతినిధులకు రోడ్డు పనులు చేయించండి మహాప్రభు అంటూ చెప్పులు అడిగేలా తిరిగిన అధికారులు ప్రజాప్రతినిధులు కనికరించకపోవడం విడ్డూరంగా ఉంది గ్రామంలో దాదాపు 90% రైతులు ఈ బాటలోనే పొలాలకు వెళ్లాల్సి వస్తుంది ట్రాక్టర్లు వెళ్లాయంటే బురదలో చిక్కుకోక తప్పడం లేదు కాలినడకన ఎలా వెళ్లాలో అర్థం కావడం లేదు ఇప్పటికైనా అధికారులు ప్రజా ప్రతినిధులు మా గ్రామం వైపు కనికరించి ధర్మాపూర్ గ్రామానికి పొలాలకు వెళ్లే రోడ్డు వేసి వ్యవసాయ రైతులకు సహకరించాలని పలువురు వ్యవసాయ కూలీలు గ్రామ ప్రజలు కోరుతున్నారు