పోచమ్మ తల్లి దేవాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
నల్లబెల్లి ఆగస్టు 10 (జనం సాక్షి):
మండలంలోని లెంకాలపెల్లి
గ్రామంలో నూతనంగా నిర్మించిన పోచమ్మ తల్లి దేవాలయాన్ని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పోచమ్మ తల్లి దీవెనలు గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. గుడి నిర్మాణ దాత గ్రామ మాజీ సర్పంచ్ గన్నెబోయిన చేరాలను అభినందించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బానోత్ సారంగపాణి, మాజీ టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు ఊడుగుల ప్రవీణ్ గౌడ్, క్లస్టర్ ఇన్చార్జులు, పార్టీ ముఖ్య నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.