పోటా పోటీగా వేదికల ఏర్పాటు
ఎమ్మెల్యే సమయస్ఫూర్తితో తీవ్ర ఉత్కంఠకు తెర
దంతాలపల్లి సెప్టెంబర్ 7 జనం సాక్షి
రెండవ విడత ఆసరా పెన్షన్ కార్డులను డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ చేతుల మీదుగా పంపిణీ చేసేందుకు నిర్ణయించగా మండలంలోని దాట్ల గ్రామంలో సర్పంచ్ కొమ్మినేని రవీందర్ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్యాలయంలో వేదికను ఏర్పాటు చేయగా, పిఎసిఎస్ చైర్మన్ సంపేట రాము ఆధ్వర్యంలో గ్రామంలోని రచ్చబండ వద్ద మరో వేదికను ఏర్పాటు చేశారు. పోటాపోటీగా ఏర్పాటు చేసిన వేదికలను చూసి గ్రామ ప్రజలు ఇద్దరు నాయకులను ఎమ్మెల్యే రెడ్యానాయక్ ఏ విధంగా సమన్వయం చేస్తారోనని ఉత్కంఠగా ఎదురు చూడగా సమయస్ఫూర్తితో వ్యవహరించిన ఎమ్మెల్యే రెడ్యానాయక్ ఏ వేదిక దగ్గరికి వెళ్లకుండా ఇరువురు నాయకులను వెంటబెట్టుకొని గ్రామంలో కలిగే తిరుగుతూ లబ్ధిదారుల ఇండ్లవద్దకే వెళ్లి పెన్షన్ కార్డులను స్వయంగా అందజేశారు. అనంతరం గున్నెపల్లి గ్రామంలో పంపిణీ చేయాల్సి ఉండగా చివరి క్షణంలో రద్దుచేసి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో పెన్షన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ ఓలాద్రి ఉమా, ఎంపీడీవో బండి గోవిందరావు,రైతుబంధు మండల కోఆర్డినేటర్ ఓలాద్రి మల్లారెడ్డి, ఎంపీఓ అప్సర్ పాషా వివిధ గ్రామాల సర్పంచులు గండి వెంకటనారాయణ గౌడ్, దర్శనాల సుస్మిత, అల్లం కృష్ణ,ధర్మారపు నాగయ్య, సోమ్లానాయక్,ఎంపీటీసీలు కొమ్మినేని సతీష్,వెంకటరమణ, లక్ష్మీపురం గ్రామ ఉపసర్పంచ్ రాము గౌడ్, నాయకులు దుండి వెంకటేశ్వర్లు భాస్కర్, రవీంద్ర చారి, కిషోర్ కుమార్, పంచాయతీ కార్యదర్శులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.