పోడు భూములకు పట్టాలివ్వాలని అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూములు ఇవ్వాలి
ములుగు జిల్లా
గోవిందరావుపేట సెప్టెంబర్ 19 (జనం సాక్షి) :-
సెప్టెంబర్ 21న కలెక్టర్ కార్యాలయం ముందు జరుగు ధర్నాను జయప్రదం చేయండి గోవిందరావుపేట మండలం సోమల గడ్డ రంగాపూర్ గ్రామాలలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గ్రామసభలు నిర్వహించడం జరిగింది. సోమలగడ్డ గ్రామంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు తుమ్మల వెంకటరెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినంక ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని పేర్కొన్నారు ములుగు జిల్లా కేంద్రంలో కుర్చీ వేసుకొని కూర్చుని మరి ఇస్తానని ఎనిమిదేళ్లయిన ఈరోజున ఎలక్షన్ల ముందు ప్రతిపక్షాల ఒత్తిడి మేరకు జీవో నెంబర్ 140 తెచ్చి అందరికీ హక్కు పత్రాలు ఇస్తా నని పేర్కొంటున్నారు అలాగే రాష్ట్రీయప్తంగా డబుల్ బెడ్రూంలు నేనే కట్టిస్తానని ఎక్కడ కూడా ఆచరణలో పూర్తికాలేదు. అనేక గ్రామపంచాయతీలకు ఒక డబుల్ బెడ్ రూమ్ కూడా సాంక్షన్ కాలేదు నేడు ఇండ్ల స్థలం లేని వారికి ఇండ్ల స్థలం ఇస్తానని స్థలం ఉన్నవారికి మూడు లక్షల రూపాయలు ఇస్తానని పేర్కొంటున్నాడు.కానీ పెరుగుతున్న ధరల ప్రకారం అర్హులైన పేదలకు ఇంటి స్థలం ఇచ్చి ఐదున్నర లక్షల ఇవ్వాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి వెంటనే పోడు భూములకు 2014 ముందు కాస్త కబ్జాలో ఉన్న అందరికీ హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు పై సమస్యల సాధన కోసం ములుగులో జరుగు ధర్నాలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఆందోళన చేపట్టాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యుడు గుండు రామస్వామి, పొదిల్ల చిట్టిబాబు,మహేందర్,దేవ్ సింగ్, నగేష్ ,కృష్ణ,శంకర్,సారయ్య పొదిల్లా చిట్టిబాబు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకుడు తదితరులు పాల్గొన్నారు.
Attachments area
|