*పోడు భూములను నూతనంగా సాగుచేస్తే *పి.డి యాక్ట్ తోపాటు 2 లక్షల రూపాయల జరిమాన! *ఎఫ్ఆర్వో ఓంకార్ _____________

లింగంపేట్ 21 అక్టోబర్ (జనంసాక్షి)
నూతనంగా పోడు భూములను సాగు చేస్తే పీడీ యాక్ట్ కేసు నమోదు తోపాటు 2 లక్షల రూపాయల జరిమాన విదిచండం జరుగుతుందని ఫారెస్ట్ రేంజ్ అధికారి ఓంకార్ అన్నారు.శుక్రవారం లింగంపేట్ మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో పంచాయతీ కార్యదర్శులు,ఫారెస్ట్ అధికారులు,ఎఫ్ఆర్సి కమిటీ మెంబర్లకు ఎంపీడీవో నారాయణ అధ్యక్షతన జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం పోడు భూముల పై సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా ఫారెస్ట్ రేంజ్ అదికారి ఓంకార్ మాట్లాడుతు పోడు భూములను గ్రామాల్లో కొట్ట కుండ పంచాయతీ కార్యదర్శులు ఎఫ్ఆర్సి కమిటీ సభ్యులు ఫారెస్ట్ భీట్ అధికారులు చర్యలు చేపట్టాలని వారికి సూచించారు.లింగంపేట్ మండలంలోని కొన్ని గ్రామాల్లో నూతనంగా పోడు భూములు కొట్టిన 20 మంది వ్యక్తుల పై కేసులు నమోదయ్యాయని మళ్లీ ఎవరైనా కొత్తగ పోడు భూములు సాగు చేస్తే కేసులు నమోదు చేస్తు పిడియాక్ట్ పెట్టడం జరుగు తుందన్నారు.పంచాయతీ కార్యదర్శులు ఎఫ్ ఆర్సి కమిటీ మెంబర్లు పోడు భూములను కొత్తగ సాగు చేయనీయమని తీర్మానం ఇచ్చినట్లయితే మండలంలో పోడు భూముల సర్వే పారదర్షకంగా చేపడతామన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో మారుతి,ఎంపిడిఓ నారాయణ,ఎస్సై శంకర్,ఎంపివో ప్రబాకర చారీ,గిర్దవార్ బాలయ్య తోపాటు పంచాయతీ కార్యదర్శులు ఫారెస్ట్ బీట్ అధికారులు ఎఫ్ఆర్సి కమిటీ మెంబర్లు పాల్గొన్నారు.
Attachments area