పోడు భూముల రక్షణ-ప్రజా సమస్యల పరిష్కారానికై ఈనెల 7 న,జిల్లా కేంద్రంలో ప్రదర్శన- ధర్నాను జయప్రదం చేయాలని కోరుతూ పోస్టర్ ఆవిష్కరణ: సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ మానుకోట లో జరిగే మహా ధర్నా ను జయప్రదం చేయండి
రాష్ట్రంలో పోడు సేద్యం పై ఆధారపడి జీవిస్తున్న గిరిజన పరిస్థితి అయోమయంగా మారిందని,అటవీ హక్కుల చట్టం ప్రకారం సేద్యంలో ఉన్న రైతులకు పట్టాలు ఇవ్వకుండా ఫారెస్ట్ వారిని అడవి అక్రమంగా ముద్ర వేస్తూ వారిపై దాడులు చేస్తున్నారు అని ముఖ్య నాయకులు అన్నారు. వారి సాగు భూముల్లో లోతైన కందకాలు పోవటం కరెంట్ స్తంభాలను ధ్వంసం చేయటం కటాక్షాలను ధ్వంసం చేయడం లాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని దీన్ని నిరసిస్తూ సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ఈ నెల 7న, మహబూబాద్ జిల్లా కేంద్రంలో మహా ప్రదర్శన ధర్నాను జయప్రదం చేయాలని కోరుతూ కురవి మండల కేంద్రంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ నిర్వహించారు.ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నాయకులు కోడి నరసన్న, కార్మిక సంఘం నాయకులు వెంపటి సుధాకరులు మాట్లాడుతూ అడామైన హామీలతో ప్రయోగం గురించి పదవిలోకి వచ్చిన టిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు కూడా పూర్తిగా అమలు చేయలేదు, దళితులకు, గిరిజనులకు కుటుంబానికి మూడెకరాల భూమి ఇస్తానని చెప్పి ఎనిమిదేళ్లు గడిచినా ఎక్కడ వేసిన గొంగిలి అక్కడే ఉంది అని వాళ్లు అన్నారు. 57 సంవత్సరాలకు ఆసరా పెన్షన్ ఇస్తామని వాగ్దానం చేసి నాలుగు ఏళ్ళు నిండుతున్నా ఒక్కరంటే ఒక్కరు కూడా కొత్త పెన్షన్ ఇవ్వలేదు, పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ఊసేలేదు రైతు రుణమాఫీ వాయిదాల పద్ధతిలో అమలు కూడా అసలు కంటే ఎక్కువ వడ్డీ భారం మోపుతున్నారు, ఉచిత విద్య నిరుద్యోగ భృతి లాంటి హామీలను విద్యార్ధి యువజనులను వెక్కిరిస్తున్నాయి. ఓ పక్క పోడు భూములకు పట్టాలు ఇస్తే ఇస్తానని చెప్పి మరో పక్క ఫారెస్ట్ అధికారి వారిపై అక్రమంగా దాడులు నిర్వహిస్తున్నారు ప్రభుత్వ ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న ప్రభుత్వంపై రాజీలేని పోరాటం చేయాలని ఈ నెల 7న జరుగే మహాధర్నాకు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో వీరభద్ర మ్మ,మచ్చ వెంకన్న, స్వాతి,తిప్పర్తి భద్రయ్య,నవీన్, యాకమ్మ,భద్రకాళి, పద్మ, పుల్లయ్య, నరసీంహ,కౌసల్యా, తదితరులు పాల్గొన్నారు.