పోతుగల్ లో బడిబాట కార్యక్రమం

ముస్తాబాద్ జూన్ 6 జనం సాక్షి
ముస్తాబాద్ మండలంలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట ఈ కార్యక్రమంలో భాగంగా జడ్.పి.హెచ్.ఎస్ పోతుగల్, ఎంపీపీ ఎస్ పోతుగల్ మరియు ఎం పి పి ఎస్ అంబేద్కర్ నగర్ పోతుగల్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు & ఉపాధ్యాయ బృందం  పిల్లల ఇంటింటికి తిరుగుతూ విద్యార్థుల నమోదు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది.
 ఇట్టి కార్యక్రమంలో పోత్గల్ సర్పంచ్ శ్రీ తన్నీరు గౌతం రావు, ఉప సర్పంచ్ మంజుల రమేష్, వార్డ్ మెంబర్ జంగ రాజు మరియు  జడ్.పి.హెచ్.ఎస్ పోతుగల్ ఎస్ఎంసి చైర్మన్ లచ్చి గారి కిషన్ విద్యార్థుల తల్లిదండ్రుల తో మాట్లాడుతూ  ప్రభుత్వ పాఠశాలల పనితీరును వారికి తెలియజేస్తూ, ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేయాల్సిందిగా వారిని కోరారు.
 ఈరోజు కార్యక్రమంలో గ్రామ యువత, అంగన్వాడి టీచర్స్, ఆయాలు, తదితరులు పాల్గొన్నారు.