పోరాడి సాధించుకున్న తెలంగాణకు కెసిఆరే సిఎం కావాలి

అభివృద్ది సాగాలంటే టిఆర్‌ఎస్‌ గెలవాలి

ప్రచారంలో మాజీ ఎమెల్యే రామలింగారెడ్డి

సిద్దిపేట,నవంబర్‌10(జ‌నంసాక్షి): పోరాడి సాధించుకున్న తెలంగాణలో కేసీఆర్‌ ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిని కొనసాగించేందుకు కారు గుర్తుకు ఓటేసి టీఆర్‌ఎస్‌ను మరోసారి అధిక మెజార్టీతో గెలిపించాలని దుబ్బాక టీఆర్‌ఎస్‌ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే రామలింగారెడ్డి కోరారు. పలు గ్రామాల్లో నిర్వహించిన ర్యాలీలో కార్యకర్తలు డప్పు చప్పుళ్లతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ కారుగుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు. సీఎం కేసీఆర్‌ అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేశాడని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సాగుకు 24గంటల కరంట్‌ సరఫరా, రైతుబంధు, బీమా, కేసీఆర్‌ కిట్టు, పింఛన్లు, కల్యాణలక్ష్మి తదితర సంక్షేమ పథకాలను అమలు చేశాడని గుర్తు చేశారు. ఈ పథకాల అమలుతో పాటు నిరుద్యోగ భృతి, పింఛన్ల పెంపు తదితర సంక్షేమ పథకాల కొనసాగింపునకు టీఆర్‌ఎస్‌కు మరోసారి ఓటేసి ఆశీర్వదించాలని ఆయన కోరారు. అభివృద్ధిని కాంక్షించే ప్రతీ ఓటరు టీఆర్‌ఎస్‌కు ఓటెయ్యాలని, కేసీఆర్‌

నేతృత్వంలో నాలుగున్నరేళల్లో జరిగిన అభివృద్ధి, అమలైన సంక్షేమ పథకాలు గత 40 ఏళ్లలో జరగలేదని అన్నారు.