పోరిక బలరాంనాయక్ మహబూబాబాద్
బలరాంనాయక్ ఆంధ్రా వర్శిటీలో ఎం.ఎ పట్టభద్రుడు. ఆయనకు భార్య తిరుపతమ్మ, కుమారులు సాయిశంకర్ నాయక్, సాయికిరణ్ నాయక్ ఉన్నారు. కానిస్టేబుల్‌గా జీవితాన్ని ప్రారంభించిన ఆయన అంచలంచెలుగా ఎదుగుతూ నేడు కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగారు. కొన్నాళ్ల పాటు సచివాలయంలో టెలిఫోను ఆపరేటర్‌గా కూడా పనిచేశారు. దేశవ్యాప్తంగా లంబాడా సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక పార్లమెంటేరియన్. మహబూబాబాద్ నుంచి 2009 ఎన్నికల్లో ఎంపీగా ఎన్నికయ్యారు. ఇదిలా ఉండగా పీవీ నరసింహరావు, కమాలుద్దీన్ అహ్మద్ తర్వాత వరంగల్ జిల్లా నుంచి మంత్రి పదవి చేపట్టిన ఘనత బలరాంనాయక్‌కే దక్కింది.