పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారు
జగన్ పోలవరం ప్రాజెక్ట్ వాస్తవాలు వెల్లడించాలి
టీడీపీ నేత దేవినేని ఉమ డిమాండ్
అమరావతి,నవంబర్13 (జనంసాక్షి) : తెలంగాణ సీఎం కేసీఆర్ మాట విని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. రాష్ట్ర రైతారగం ప్రయోజనాలను తాకట్టుపెట్టేలా, లక్షలాదిమంది నిర్వాసితుల జీవితాలను, వారు చేసిన త్యాగాలను అవహేళన చేసేలా, పోలవరం ప్రాజెక్ట్ ఎత్తుని 3.57విూటర్లకు తగ్గించడానికి సిద్ధపడ్డారని మండిపడ్డారు. పక్కరాష్ట్ర ముఖ్యమంత్రి ఒక విూటర్ తగ్గిస్తే ఏమవుతుందంటూ, అసెంబ్లీలో ప్రశ్నిస్తే, ఆయనకు మేలుచేసేలా ఏపీ ముఖ్యమంత్రి ప్రవర్తించడం సిగ్గుచేటని దేవినేని అన్నారు. పోలవరం ఎత్తు తగ్గించడానికి జగన్‌మోహన్ రెడ్డి సుముఖంగానే ఉన్నారని, సెప్టెంబర్ 15, 2019న తెల……..గాణ అసెంబ్లీలో ఆరాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే, ఏపీ ముఖ్యమంత్రి, ఆ మాటలను ఖండించిన పాపానపోలేదన్నారు. ఆ నాడు కేసీఆర్ అన్నమాటల్లోని అర్థం, నేడు ఏపీలోని రైతారగానికి అర్థమవుతోందన్నారు. పోలవరం ప్రాజెక్ట్ ఎత్తుని తగ్గించడానికి, రాష్ట్ర రైతారగంప్రయోజనాలను తాకట్టు పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి ఎందుకు సిద్ధపడ్డారని దేవినేని ఉమా ప్రశ్నించారు. పోలవరం నిర్మాణానికి సంబంధించి అక్టోబర్ 28న, కేంద్రానికి ఉత్తరం రాసేసి, చేతులు దులుపుకున్న జగన్మోహన్ రెడ్డి, ప్రధానిని కలిసిన ప్రతిసారీ, ప్రాజెక్ట్ నిధుల గురించి ఎందుకు చర్చించలేదని నిలదీశారు. చంద్రబాబు హయాంలో పోలవరం నిర్మాణానికి రూ.55,548 కోట్లకు కేంద్రం నుంచి అనుమతి పొందితే, జగన్ ప్రభుత్వంలోని 28మంది ఎంపీలు (రాజ్యసభల్ఖోక్ సభ) ఏం చేస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి హూదాలో ప్రధానికి, కేంద్ర జలవనరుల శాఖామంత్రికి జగన్ రాసిన ఉత్తరాలను ఎందుకు బయటపెట్టడం లేదో చెప్పాలన్నారు. నిజంగా పోలవరం నిధుల గురించే జగన్ లేఖలు రాసిఉంటే, అవన్నీ ఎందుకు ప్రజలముందు ఉంచడం లేదని ప్రశ్నించారు.’పక్కరాష్ట్ర ముఖ్యమంత్రి నిండు శాసనసభలో అలా మాట్లాడితే, ఏపీ ముఖ్యమంత్రి ఎందుకు నోరు తెరవలేదు? 45.72 విూటర్లు అంటే 150అడుగుల ఎత్తులో పోలవరం డ్యామ్ లో నీరు నిల్వచేయాలి. రూ.27వేల కోట్ల వరకు నిర్వాసితులకు డబ్బులు చెల్లించాలి. అన్ని సమస్యలుంటే, అవన్నీ వదిలేసి, 135 అడుగులకే తాము పరిమితమవుతాం. ఏదో తూతూమంత్రంగా రూ.3వేల కోట్లు ఖర్చుపెడతామంటూ, రాష్ట్ర ముఖ్యమంత్రే చీఫ్ ఇంజనీర్ తో మాట్లాడిస్తున్నారు. 5కోట్ల ప్రజల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్ గురించి, ఒక చీఫ్ ఇంజనీర్ చెప్పడమేంటి?. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, సెంట్రల్ వాటర్ కమిషన్ సభ్యులు, డ్యామ్ డిజైన్ రివ్యూప్యానెల్ సభ్యులు, డ్యామ్ గురించి, అక్కడ జరగుతున్న పనులు గురించి ఏం చెప్పారు… మినిట్స్ ఏమని వచ్చాయో అన్నీ బయటపెట్టండి.’ అని దేవినేని ఉమా డిమాండ్ చేశారు. మరోవైపు పోలవరం ప్రాజెక్ట్ షెడ్యూల్ ప్రకారం అవుతుందని ట్విట్లర్‌విజయసాయిరెడ్డి చెబుతున్నారని దేవినేని ఎద్దేవా చేశారు. ‘ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి చెప్పిన షెడ్యూల్స్ అన్నీ అయిపోయాయి.. ఇప్పుడు ట్విట్టర్ రెడ్డి షెడ్యూళ్ల వంతువచ్చింది.’ అని సెటైర్ వేశారు.చంద్రబాబునాయుడు ట్వీట్ చేసేవరకు కర్నూలు జిల్లా నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబానికి జరిగిన అన్యాయం బయటి ప్రపంచానికి తెలియలేదని దేవినేని ఉమా అన్నారు. సలాం కుటుంబసామూహిక ఆత్మహత్యల ఘటనపై ప్రభుత్వం పెట్టిన కేసులవల్ల 12గంటల వ్యవధిలోనే పోలీసులు బయటకు వచ్చారని, అదే సమయంలో అమరావతి రైతులు మాత్రం 18రోజుల పాటు జైల్లో ఉన్నారని ఉమా అన్నారు. దీన్నిబట్టే రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోందని చెప్పొచ్చని ఉమా అన్నారు.