పోలీసులమని చెప్పి.. ఢిల్లీ యువతులపై గ్యాంగ్‌రేప్, నిందితుల్లో హైదరాబాదీ

3wahuei5
పనాజీ: గోవా రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు యువతులపై జరిగిన అత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులమని చెప్పిన ఐదుగురు దుండగులు ఈ దారుణానికి పాల్పడ్డారు. కాగా, ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ఢిల్లీకి చెందిన 22 సంవత్సరాలు, 30 సంవత్సరాలు కలిగిన ఇద్దరు యువతులు విహార యాత్ర కోసం గోవాకు వెళ్లారు. గత సోమవారం రాత్రి యువతులిద్దరూ ఓ ట్యాక్సీని అద్దెకు తీసుకుని అంజునా బీచ్‌కు వెళ్తుండగా మార్గ మధ్యలో ఐదుగురు వ్యక్తులు వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఆపారు. యాంటీ నార్కోటిక్స్ సెల్‌కు చెందిన పోలీసులమని చెప్పారు. కారును తనిఖీ చేయాలంటూ చెప్పి కారులో, యువతుల బ్యాగుల్లో సోదాలు చేశారు. మార్గమధ్యలో టాక్సీ డ్రైవర్ ఏటిఎం పిన్ నెంబర్‌ను బలవంతంగా తెలుసుకుని, అతని ఖాతా నుంచి రూ. 10వేలు డ్రా చేసుకున్నారు. విచారణ చేయాలంటూ చెప్పి యువతులను వారు ఉండే ప్లాట్‌కు తీసుకువెళ్లారు. టాక్సీని తమ వద్దే ఉంచుకుంటామని, రూ. 1.5లక్షల ఇచ్చి టాక్సీని తీసుకెళ్లాలని చెప్పి డ్రైవర్‌ను అక్కడ్నుంచి పంపించేశారు. అనంతరం యువతులను తీవ్రంగా కొట్టి వారిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. జరిగిన ఘటనపై ట్యాక్సీ డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదుతో క్రైం బ్రాంచ్ పోలీసులు సదరు ప్లాట్‌పై దాడిచేసి నిందితులు అర్పోరాకు చెందిన అజయ్ కుస్బాస్(39), కర్వార్‌కు చెందిన జీవన్ పవర్(26), రాజస్థాన్‌కు చెందిన నదీమ్ ఖాన్(28), ముంబైకి చెందిన ట్రెబోర్ జోసెఫ్(27), హైదరాబాద్‌కు చెందిన కుమేష్ చౌదరి(21)లను అదుపులోకి తీసుకున్నారు. వీరితోపాటు వారికి సహకరించిన ఓ మహిళను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
l