పోలీసులు విస్తృత తనిఖీలు

వేమనపల్లి,అక్టోబర్ 13 (జనంసాక్షి)

మండల కేంద్రంలోని మంగనపల్లి ఎక్స్ రోడ్ వద్ద చెన్నూరు రూరల్ సిఐ విద్యాసాగర్ ఆధ్వర్యంలో ముమ్మరంగా వాహనాల తనిఖీ నిర్వహించారు.ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ మావోయిస్టుల కదలికలు ఉండడంతో అదనపు బలగాలను మోహరించి భద్రతా చర్యలు చేపట్టామని,ప్రధాన కూడళ్ళ వద్ద సీసీ కెమెరాలతో నిరంతరం నిఘా చేపట్టామని అన్నారు.ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అపరిచితులను ఎవరిని వాహనాల ద్వారా తీసుకు వెళ్లవద్దని ఆయన అన్నారు.అదేవిధంగా నిషేధిత పదార్థాలను కూడా వాహనాల ద్వారా రవాణా చేయకూడదని అలా చేసినట్లయితే చట్టరీత్యా చర్యలు తప్పవని అన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పక హెల్మెంట్‌ ధరించాలని,డ్రైవింగ్‌ లైసెన్స్‌,ఇన్సూరెన్స్‌, వాహన రిజిస్ట్రేషన్‌ కాగితాలు కలిగి ఉండాలన్నారు. చిన్న పిల్లలకు వాహనాలు ఇవ్వరాదన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.కారులో ప్రయాణించే వారు సీటు బెల్టు తప్పనిసరి ధరించాలని అన్నారు.అంతేకాక పలువురు వాహనదారులకు కౌన్సిలింగ్ ఇవ్వడంతోపాటు,సరైన పత్రాలు లేని వారికి ఫైన్ లు విధిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఎస్ హెచ్ వో నరేష్ టిఎస్పిఎస్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు