పోలీసుల చొరవ అభినందనీయం
జాబ్ మేళా ను సద్వినియోగం చేసుకోవాలి
రాష్ట్ర మంత్రి గంగుల
నిరుద్యోగాన్ని రూపుమాపడమే లక్ష్యంగా కరీంనగర్ పోలీసులు జాబ్ మేళా ను ఏర్పాటు చేయడం అభినందనీయమని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మంగళవారం స్థానిక పద్మనాయక కల్యాణ మండపంలో జాబ్ మేళ ను ప్రారంభించి ఆయన మాట్లాడారు. జాబ్ మేళా ను సద్వినియోగం చేసుకోవాలని యువతకు మంత్రి పిలుపునిచ్చారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణ ప్రత్యేక చొరవతో జాబ్ మేళా ను ఏర్పాటుచేసారని 3000 మందికి వివిధ కంపెనీలు ఆవకాశం కల్పిస్తున్నాయని అన్నారు. ఈ సందర్బంగా పోలీలను అభినందించారు. కార్యక్రమంలో కరీంనగర్ కలెక్టర్ వి కర్ణన్, నగర మేయర్ సునీల్ రావు లు పాల్గొన్నారు.