పోలీసు అమరవీరుల త్యాగాలు భావితరాలు స్మరించుకోవాలి..

కేసముద్రం అక్టోబర్ 21 జనం సాక్షి /పోలీసు అమరవీరుల త్యాగాలు భావితరాలు ఎప్పటికీ స్మరించుకోవాలని కేసముద్రం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కోగిల తిరుపతి అన్నారు.శుక్రవారం రోజున మండల కేంద్రంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకుని  విద్యార్థిని విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి అందులో గెలుపొందిన విద్యార్థులకు బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి ఎస్సై తిరుపతి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.కళాశాల ప్రిన్సిపల్ అజీజ్ బేగ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ పోలీసు అమరవీరుల త్యాగాలు ప్రతి ఒక్కరూ స్మరించుకుంటూ బాధ్యతాయుతంగా సమాజంలో జీవించాలని అన్నారు. ఈ సందర్భంగా ఇలాంటి మంచి కార్యక్రమాన్ని నేషనల్ హ్యూమన్ రైట్స్  కేసముద్ర మండల కమిటీ వారు నిర్వహించడం చాలా అభినందించదగ్గ విషయమని భవిష్యత్ లో మరిన్ని సేవ కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల కమిటీ బాధ్యులు అధ్యక్షుడు కొనకటి మహేందర్ రెడ్డి. ఉపాధ్యక్షుడు వనం విద్యాసాగర్,వర్కింగ్ ప్రెసిడెంట్ పానుగంటి విష్ణువర్ధన్, శంకర్, బిర్రు జీవన్ ,కళాశాల అధ్యాపక బృందం, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
Attachments area