పోలీసు అమరుల త్యాగాలు మరువలేనివి ప్రజారక్షణ, శాంతి భద్రతలే పోలీసుల లక్ష్యం

టేకులపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆన్తోటి వెంకటేశ్వరరావు

టేకులపల్లి, అక్టోబర్ 21 జనం సాక్షి): పోలీస్ అమరుల త్యాగాలు మరువలేనివని, ప్రజా రక్షణ, శాంతిభద్రతలే పోలీసుల లక్ష్యంగా ప్రాణాలను సైతం ప్రాణంగా పెట్టి పనిచేస్తూ ఎందరో అమరులైన వారందరిని స్మరించుకుందామని టేకులపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆన్తోటి వెంకటేశ్వరరావు అన్నారు. శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ కార్యాలయం లో జరిగిన సంస్మరణ దినోత్సవ కవాతుకు హాజరయ్యారు. 1959లో భారత్, చైనా సరిహద్దుల మధ్య చాలా ఉద్రిక్తతలు తలెత్తాయి. అక్టోబర్ 21న లడఖ్‌లో చైనా 20 మంది సైనికులపై కాల్పులు జరిపింది, అందులో 10 మంది భారతీయ సైనికులు మరణించారు. ఈ పోలీసుల అంత్యక్రియలు తూర్పు లడఖ్‌లో జరిగాయి. అప్పటి నుంచి అక్టోబర్ 21న పోలీసు సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. పోలీసు వ్యక్తులు, వారి కుటుంబ సభ్యుల ఆత్మలను గౌరవించడంలో ఈ రోజు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ప్రాణత్యాగం చేసిన వారందరికీ నివాళులు అర్పించేందుకు జరుపుకుంటారనితెలిపారు.