పోలీసు అమర వీరుల త్యాగాలు వెలకట్టలేనివి

 నర్సాపూర్ ఎస్సై గంగరాజు
 నరసాపూర్. అక్టోబర్,  21, ( జనం సాక్షి )
 విధి నిర్వహణలో మరణించిన  పోలీస్ అమరవీరుల త్యాగాలను వెల కట్టలేమని నర్సాపూర్ ఎస్ ఐ గంగరాజు అన్నారు.   శుక్రవారం నాడు  నర్సాపూర్ పట్టణంలో పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని ఘనంగా జరిపారు.  ఈ సందర్భంగా ఎస్ ఐ ఆధ్వర్యంలో  పోలీస్ సిబ్బంది తో పాటు విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు.   ర్యాలీ  పట్టణంలోని ప్రధాన వీధుల గుండా సాగింది.  అనంతరం  పోలీస్ స్టేషన్ లో  విధి నిర్వహణలో అమరులైన పోలీసుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి  వారు చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎస్సై శ్రీనివాస్, కానిస్టేబుల్లు రాము, పాండు, భిక్షపతి, యాదయ్య, శ్రీశైలం, సంతోష్, కవిత, బిందు ఇతర  పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
 ఫోటో రైట్ అప్ ఏన్ ఎస్ పి 1  నర్సాపూర్ పట్టణంలో ర్యాలీ నిర్వహిస్తున్న పోలీసులు