పోలీస్ అమర వీరుల త్యాగాలు మరువలేనివి

పోలీస్ సంస్కరణ దినోత్సవంలో ఎస్ఐ శంకర్
_________________________
లింగంపేట్ 21 అక్టోబర్ (జనంసాక్షి)
 పోలీస్ అమర వీరుల త్యాగాలు మరువలేనివి అని లింగంపేట్ ఎస్ఐ శంకర్ అన్నారు.ఆయన శుక్రవారం లింగంపేట్ మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో పోలీస్ సంస్కరణ దినోత్సవం పురస్కరించుకొని అమరుల వీరుల స్థూపం చిత్ర పటానికి పూల మాలవేసి నివాళులు అర్పించారు.ఈ సందర్బంగా అమరుల త్యాగాలను కొనియాడారు.వీరితో పాటు మండల కేంద్రానికి చెందిన బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ స్టేషనలో అమరుల స్థూపం చిత్రపటానికి పూలమాల వేసి నివాలులు అర్పించారు.ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ రంగరావు, జమేదార్లు పెంటయ్య,రాజెందర్,రాజయ్య,కానిస్టేబుల్లు భ్తెరవప్రసాద్, రామస్వామి, ప్రసాగౌ,సంపత్,రాజు,స్వామిగౌడ్,  బీసీ సంఘం మండలం అద్యక్షులు ఆకుల సత్యం,టౌన్ ప్రెసిడెంట్ కె రాజు సంఘ సభ్యులు పాల్గొన్నారు.
Attachments area