పోలీస్ ఉద్యోగాల ప్రిలిమినరీ రిజల్ట్స్ లో ఎంకేఆర్ ఫౌండేషన్ సంచలనం

ప్రాథమిక ఫలితాల్లో 939 మందిని వరించిన విజయం.

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం,(జనంసాక్షి):- ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి  స్థాపించిన  ఎంకేఆర్ ఫౌండేషన్ ద్వారా పోలీస్ ఎస్.ఐ  పరీక్షలకు శిక్షణపొందిన 580 మంది అభ్యర్థులలో 225 మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు. వీరిలో  119 మంది మహిళా అభ్యర్థులు , 106 మంది పురుషులు. పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలకు శిక్షణపొందిన 1050 మంది అభ్యర్థులలో 714 మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు. వీరిలో  397 మంది మహిళలు , 317 మంది పురుషులు. మొత్తం 939 మంది అభ్యర్థులు తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించిన ప్రాథమిక పరీక్షల్లో ఎంకేఆర్ ఫౌండేషన్ నుండి శిక్షణపొందిన అభ్యర్థులు  ఉత్తీర్ణులై శారీరక పరీక్షలకు ఎంపికయ్యారు. ఫలితాల పట్ల ఆనందం వ్యక్తంచేసిన ఎమ్మెల్యే  రెండవవిడత పరీక్షలకు త్వరలోనే ఈవెంట్స్ శిక్షణను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు