పోలీస్ శాఖ ఆద్వర్యంలో మహార్షి వాల్మీకి జయంతి వేడుకలు..
నిజామాబాద్ బ్యూరో,అక్టోబర్ 09(జనంసాక్షి):
వాల్మీకి జయంతి సందర్భంగా ఆదివారం పోలీస్ కార్యాలయం యందు నిజామాబాద్ పోలీస్ కమీషనర్ కె.ఆర్. నాగరాజు, ఐ.పి.యస్, ఆద్వర్యంలో ‘ *మహార్షి వాల్మీకి జయంతి*” కార్యాక్రమం నిర్వహించడం జరిగింది.
*ఈ సందర్భంగా వాల్మీకి ఫోటోకు పుష్పగుచ్చాలు సమర్పించడం జరిగింది*.
అనంతరం పోలీస్ కమీషనర్ మాట్లాడుతూ శ్రీ మద్రామాయణ మహాకావ్య సృష్టికర్త మహార్షీ వాల్మీకి అనియు, ఒక సామాన్య వ్యక్తిగా పుట్టి బోయవాడిగా అడవిలో పెరిగి సప్తబుషుల బోధనల ద్వారా మహార్షి వాల్మీకిగా మారి అద్భుతమైన రామాయణం గ్రంధాన్ని మనకు అందించిన మహానీయుడు వాల్మీకి అని, మనము అందరమూ ఆయనను స్మరించుకోవలసిన అవసరం ఉందని, ఆదర్శవంతమైన జీవితం గడపడంతో పాటు సమాజ శ్రేయస్సుకు అవసరమైన జీవన సూత్రాలను రామాయణం ద్వారా వాల్మీకి బోధించారని తెలియజేశారు.
ఈ కార్యాక్రమంలో ఆర్.ఎస్.ఐ నిషిత్, సి.సి.ఆర్.బి సిబ్బంది, ఐ.టి కోర్ సిబ్బంది, పోలీస్ కంట్రోల్ రూమ్ సిబ్బంది, సెంట్రల్ కాంప్లెంటు సెల్ సిబ్బంది, స్పెషల్ పార్టీ సిబ్బంది, పోలీస్ కార్యలయం సిబ్బంది, హోమ్ గార్డ్సు సిబ్బంది పాల్గొన్నారు.