పౌరసత్వ బిల్లుతో అట్టుడుకుతున్న ఈశాన్యం

భయాలు వద్దని ప్రధాని మోడీ హావిూ

ఇది కేవలం శరణార్థులకు మాత్రమే ఉద్దేశించిందన్న షా

న్యూఢిల్లీ,డిసెంబర్‌12(జ‌నంసాక్షి): పౌరసత్వ సవరణ బిల్లు రాజ్యసభలోనూ ఆమోదం పొందడంతో ఈశాన్య రాష్టాల్ల్రో ఆందోళనలు కొనసగాతూనే ఉన్నాయి. అసోం, త్రిపురల్లో నిరసన జ్వాలలు తీవ్రస్థాయిలో చెలరేగుతున్నాయి. ఆందోళనలను అడ్డుకునేందుకు అసోంలో బుదశారం రాత్రి నుంచి నిరవధిక కర్ఫ్యూ

విధించారు. అయితే కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘించి గురువారం ఉదయం ప్రజలు రోడ్లపైకి చేరి నిరసనలు చేపట్టారు. దీంతో ఆర్మీ ప్లాగ్‌ మార్చ్‌ నిర్వహించింది. అటు దిబ్రుగఢ్‌ జిల్లాలోనూ కర్ఫ్యూ విధించారు. అయినప్పటికీ ఆందోళనకారులు బయటకు వచ్చి నిరసనలకు పాల్పడ్డారు. అసోం ముఖ్యమంత్రి శర్వానంద సోనోవాల్‌ ఇంటిపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. గౌహతిలో ఉదయం 11 గంటలకు పెద్ద ఎత్తున ఆందోళన చేసేందుకు ఆల్‌ అసోం స్టూడెంట్స్‌ యూనియన్‌ పిలుపునిచ్చింది. త్రిపురలోనూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. నిరసనల కారణంగా కోల్‌కతా, అసోం మధ్య పలు విమాన సేవలను నిలిపివేశారు. పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రమైన అసోంలో పెద్ద ఎత్తున నిరసన జ్వాలలు రేగిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పందించారు. క్యాబ్‌పై ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని, విూ హక్కులను ఎవరూ హరించలేరు.. అంటూ ట్విటర్‌ వేదికగా అసోం ప్రజలకు హావిూ ఇచ్చారు. ‘పౌరసత్వ సవరణ బిల్లుపై అసోం సోదరసోదరీమణులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. విూ హక్కులను, ప్రత్యేకమైన గుర్తింపును, అందమైన సంస్కృతిని ఎవరూ హరించలేరు. ఆ సంస్కృతి, గుర్తింపు వృద్ధి చెందుతూనే ఉంటాయి. అందుకు నాదీ హావిూ. అసోం ప్రజల రాజకీయ, భాషా, సాంస్కృతిక, భూ హక్కులను రాజ్యాంగబద్ధంగా పరిరక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం, నేను పూర్తిగా కట్టుబడి ఉన్నాం’ అని మోదీ ట్విటర్‌లో పేర్కొన్నారు. పొరుగు దేశాల్లో మతపరమైన పీడనకు గురై భారత్‌లో ఆశ్రయం కోరి వచ్చిన శరణార్థులకు పౌరసత్వం కల్పించే దిశగా ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ బిల్లుకు పార్లమెంట్‌ ఉభయ సభల్లోనూ ఆమోదం లభించిన విషయం తెలిసిందే. అయితే, ఈ బిల్లును వ్యతిరేకిస్తూ అసోంలో ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. ఇది కేవలం శరణార్థులుగా వచ్చిన వారి కోసమే అని ¬ంమంత్రి అమిత్‌ షా కూడా పదేపదే స్పష్టం చేశారు.