పౌరసరఫరాలశాఖ మంత్రుల సమావేశం
ఢిల్లీ: కేంద్ర మంత్రి కేవీ థామస్ అధ్యక్షతన పౌరసరఫరాలశాఖ మంత్రుల సమావేశానికి పలు రాష్ట్రాల పౌరసరఫరాల శాఖ మంత్రులు పాల్గొన్నారు. చక్కెర, పామాయిల్, కిరోసిన్, కోటా పెంచాలని మంత్రి శ్రీధర్‌బాబు కేంద్రాన్ని కోరారు. ప్రజా పంపిణీ వ్యవస్థ కంప్యూటరీకరణకు ఆర్థిక సాయం అందించాలని కోరారు. వరి మద్దతు ధర పెంచాలని ఆయన కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.