పౌరులందరికీ రాజ్యాంగం సమాన హక్కులు కల్పించింది. మున్సిపల్ వైస్ చైర్మన్ చల్లా శ్రీలత రెడ్డి
నేరేడుచర్ల (జనంసాక్షి)న్యూస్.పౌరులందరికీ రాజ్యాంగం సమాన హక్కులు కల్పించిందని,ఒకరు ఇంకొకరు పై వివక్షత చూపితే చట్ట రీత్యా నేరం అవుతుందన్నారు.మున్సిపల్ వైస్ చైర్మన్ చల్లా శ్రీలత రెడ్డి అన్నారు.మున్సిపాల్టీలో నాలుగో వార్డులో అధికారులు సివిల్ రైట్స్ డే నిర్వహించారు.ఈ సందర్బంగా అధికారులు పౌర హక్కుల పై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో 04 వార్డు కౌన్సిలర్ షేక్ భాష,మున్సిపల్ మేనేజర్ అశోక్ రెడ్డి, మున్సిపల్ కార్యాలయ సిబ్బంది,మేప్మా సిబ్బంది తదితరులు ఉన్నారు.