ప్రకటనల్లో
ముంబై : భారత్ జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోనీని విరాట్ కోహ్లీ మించిపోయాడు. వివిధ ఉత్ప త్తులకు బ్రాండ్ అంబాసిడర్ ప్రచారకర్తగా తెరపై కనిపించడంలో కోహ్లీ ఈ ఘనత సాధించాడు. ఈ విషయంలో నిరుడు కోహ్లీ 200 శాతం వృద్ది సాధించడాడని మీడియా ట్రాకింగ్ ఏజెన్సీ టామ్ తెలిపింది. ప్రస్తుతం కోహ్లీ 12 రకాల ఉత్పత్తులకు ప్రచారకర్తగా ఉన్నాడు. కెప్టెన్ ధోనీ 16 కంపెనీలకు అంబాసిడర్‌గా కొనసా గుతున్నాడు. ధోనీ ఏడాదికి వంద కోట్లు సంపాదిస్తాడు. ఒక్కో బ్రాండ్‌కు అతను ఏడాదికి 8 నుంచది 10 కోట్ల రూపాయల వరకు తీసుకుంటాడు. అయితే, తమ కంపెనీ అంబాసిడర్‌ను ఎంచుకోవడంలో పలు సంస్థలు ధోనీ తర్వాత కోహ్లీ వైపే మొగ్గుచూపుతున్నాయి. కోహ్లీ ఏడాదిపాటు ప్రచారానికి తీసుకునే మొత్తం నిరుడు 3 కోట్ల రూపాయలుగా ఉంది. ఈ మొత్తం ప్రస్తుతం 6 కోట్లకు చేరింది. కోహ్లీ ప్రచార ఖాతాలోకి నెస్లీ మంచ్, సింథాల్ డియో స్ప్రే కూడా చేరాయి. ఇవికాక ఒక షాంపూ, లాప్‌టాప్ ఉత్పత్తులకు కూడా త్వరలో ప్రచారకర్తగా వ్యవహరించనున్నాడు.