ప్రచారంలో ఆకట్టుకునేలా ప్రయత్నాలు

సోమారపు ప్రచారంలో హుషారుగా కార్యకర్తలు

రామగుండం,నవంబర్‌17(జ‌నంసాక్షి): టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి పనులను చూసి మరోసారి కారు గుర్తుకు ఓటెయ్యాలని టీఆర్‌ఎస్‌ రామగుండం నియోజకవర్గ అభ్యర్థి సోమారపు సత్యనారాయణ అన్నారు. ఈ మేరకు ఆయన తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఓటర్లను నేరుగా కలుసుకోవడం, సమావేవౄలు ఏర్పాటు చేసి మాట్లాడడం, ర్యాలీలు తీస్తూ ముందుకు సాగుతున్నారు. ఎవరినీ వదలకుండా పేరుపేరునా పలకరిస్తూ ముందుకు వెళుతున్నారు. కెసిఆర్‌ విూదున్న నమ్మకం భరోసాతోనే వివిధ పార్టీల నుంచి భారీగా టీఆర్‌ఎస్‌ చేరుతున్నారని అన్నారు.రామగుండం నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్న తనను మరోసారి ఆశ్వీరదించాలన్నారు. టీఆర్‌ఎస్‌ అభివృద్ధికి ఆకర్షితులై పార్టీలో చేరిన వారికి భవిష్యత్‌లో అండగా నిలబడతాన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలని సత్యనారాయణ సూచించారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ భారీ మెజార్టీతో గెలిచేలా నాయకులు, కార్యకర్తలు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ముఖ్యమంత్రిగా మళ్లీ కేసీఆర్‌ను గెలిపించుకోవాలన్నారు. రాష్ట్రంలోని అన్నివర్గాల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ముందుకు సాగుతున్నారని సత్యనారాయణ పేర్కొన్నారు. అభివృద్ధి కావాలంటే టీఆర్‌ఎస్‌ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. సుధీర్ఘ రాజకీయ అనుభవంతో ప్రతిపనిపై దూరదృష్టితో ఆలోచించి నియోజక వర్గంలో ఒక్కో సమస్యను పరిష్కరిస్తున్నానని చెప్పారు.టీడీపీ, కాంగ్రెస్‌ చేయలేని పనులు నాలుగేండ్లలో చేసిందని గుర్తు చేశారు. సంక్షేమంలో రాష్ట్రం దేశంలోనే ఆదర్శంగా నిలిచిందిని పేర్కొన్నారు. డిసెంబర్‌ 7న జరగనున్న ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.