ప్రజలందరి భాగస్వామ్యంతో పట్టణాభివృద్ధి -రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్.
పట్టణాభివృద్ధి లో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్. పట్టణ ప్రగతి కార్యక్రమం సందర్భంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని 19వ వార్డ్ లోని మార్వాడి సత్రంలో వార్డ్ కమిటీ సభ్యులతో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్, జిల్లా కలెక్టర్ కె. శశాంక, మునిసిపల్ చైర్మన్ పాల్వాయి రాం మోహన్ రెడ్డి, అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ తో కలిసి పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ, 5వ విడత పల్లె ప్రగతి, 4వ విడత పట్టణ ప్రగతి కార్యక్రమాలను ఈ రోజు ప్రారంభించుకుంటున్నామని, బ్రహ్మాండంగా గ్రామాలు అభివృద్ధి చేస్తున్న తరుణంలో తిరిగి గ్రామాలకు ప్రజలు వెళుతున్నారని, ప్రభుత్వ పరంగా చేస్తున్న వివరాలను జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ తెలియజేసారని, 1988-89లో చాలా రోజులు ఈ వార్డులో నే ఉన్నానని, మానుకోట లో మీ పక్కనే, మీతో కలిసి ఉన్నానని, మి అందరి, సి.ఎం. కె.సి.ఆర్. ఆశీస్సులతో మంత్రి అయ్యానని, పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమాల్లో పాల్గొనడం నా అదృష్టమని, తెలిపారు. డాక్టర్ అయినప్పటికీ ప్రజలకు సేవ చేయాలనే తపనతో మునిసిపల్ కౌన్సిలర్, చైర్మన్ అయిన రామ్ మోహన్ రెడ్డి అహర్నిశలు కష్ట పడుతున్నారని, తన వార్డ్ తో పాటు పట్టణంలో అభివృద్ధి పనులు చేపడుతున్నారని తెలిపారు. 2011-12 లో మహబూబాబాద్ గ్రామ పంచాయితీ ఉండి మునిసిపాలిటీ అయిందని, మానుకోట కు మాస్టర్ ప్లాన్ 1960 లోనే రూపొందించుకోవడం జరిగిందని, అది సరిగా అమలు కాలేదని, ఇప్పుడూ మునిసిపాలిటీ నుండి జిల్లా గా మారడం తో దానికి తగ్గట్లుగా ప్రధాన రోడ్లు వెడల్పు చేయాలన్న, మహబూబాబాద్ ను అందంగా తయారు చేయాలన్న సందర్భంలో కొన్ని సమస్యలు ఎదురవు తున్నాయని, సమీక్షలు చేసి రోడ్లు వెడల్పు, మిషన్ భగీరథ ద్వారా మంచినీటి సరఫరా, పట్టణంలో చేయవలసిన పనులను పరిష్కరించుకుంటామని తెలిపారు. భద్రాచలం నుండి హైదరాబాద్ వరకు నేషనల్ హై వే మంజూరు అయిందని, తొర్రూరు వరకు టెండర్ అయ్యాయని, భద్రాచలం నుండి మహబూబాబాద్ టౌన్ నుండి వస్తే అనేక ఇళ్లులు పోతాయని, దానిని బై పాస్ చేస్తున్నామని, ఇల్లందు రోడ్ నుండి మరిపెడ రోడ్డు వరకు కలుపుతూ నెల్లికుదురు రోడ్డుకు వస్తుందని, ఊరు బయట నుండి బై పాస్ అయి వెళుతుందని, ఆ క్రమంలో 50 శాతం మహబూబాబాద్ బై పాస్ అవుతుందని, ఆ బై పాస్ కు ఒక వైపు ఇల్లందు రోడ్డుకు కలుపుతూ, మరొక వైపు మరిపెడ రోడ్డు ఉందని, ఇప్పుడు వేసే పత్తిపాక రొడ్డునూ బై పాస్ కు కలిపే ఆలోచన ఉందన్నారు. ఇంకో వైపు మెడికల్ కళాశాల కడుతున్న ప్రదేశంలో ఎస్పీ కార్యాలయం దగ్గరకు పోయే రోడ్డు లో గల ఎస్ఆర్ఎస్పి కాల్వలను మూసివేసి ప్రక్కకు జరిపి నాలుగు లైన్ ల రహదారి వేసి దానిని కూడా బై పాస్ కు కలపాల నే ఆలోచన ఉన్నదన్నారు. ఆ లోగా అంతర్గతంగా రోడ్లను పూర్తి చేసుకోవలసిన అవసరం ఉందని, 50 కోట్లతో రోడ్ వెడల్పు, బలోపేతం, స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు, డివైడర్ లను పూర్తి చేసుకుంటున్న తరుణంలో మిషన్ భగీరథ నీరు సౌకర్యం కల్పించి, విద్యుత్ పోల్స్ షిఫ్ట్ చేసుకోవాలని తెలిపారు. ప్రజలకు మౌళిక వసతులు కల్పించే తరుణంలో వార్డ్ మ్యాపింగ్ ద్వారా వార్డ్ స్థితిగతులు అవగాహన కలిగి వార్డ్ లో వసతులు మెరుగు పరుచుకావాలని, అలాగే క్రీడా ప్రాంగణం ఏర్పాటుకు స్థలం చూడాలని తెలిపారు. ఇల్లు నిర్మించే ముందు చెట్లు కూడా ఉండేలా చూడాలని, పట్టణ, పల్లె ప్రగతిలో హరిత హారం ప్రధాన లక్ష్యం అని ఆడబిడ్డ గా అభ్యర్థిస్తున్నానని, చెట్లు పెంచి ఆక్సిజన్ శాతం పెంచుకొని ఆరోగ్యవంతంగా జీవించాలని తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, పల్లె, పట్టణ ప్రగతి చాలా మంచి కార్యక్రమం అని, యువత ఈ కాలంలో దురలవాట్లకు బానిస అవుతున్నారనీ, వారి భవిష్యత్తు దృష్ట్యా మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండాలనే ఉద్దేశ్యంతో క్రీడా ప్రాంగణాలు ప్రారంభించు కుంటున్నామని, మన బాగు కోసం సి.ఎం. ఆలోచిస్తున్నారని, గతంలో ఉన్న మానుకోట కు ఇప్పుడు ఉన్న మానుకోటకు చాలా మార్పులు కలిగాయని, అభివృద్ధి కనపడుతుంది అని, ఇప్పుడు చేపడుతున్న పట్టణ ప్రగతిలో అవసరం మేరకు పనులు చేసుకొని వార్డ్ లను అందంగా తీర్చి దిద్దాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, మహబూబాబాద్ పట్టణం చిన్నదైనా 36 వార్డులు ఉన్నాయని ముఖ్యమైన పట్టణం కాబట్టి కొన్ని సమస్యలు ఉన్నాయని, విద్యుత్ శాఖకు సంబంధించి క్రొత్త ఇళ్లకు కరెంట్ లైన్, పోల్స్ షిఫ్ట్ పనులు చేస్తారని తెలిపారు. డబ్బులు కట్టి ఆరు నెలలు ఆగాల్సిన సమయాన్ని విద్యుత్ అధికారులు టైం లైన్ తగ్గించి పనులు త్వరగా అయ్యేటట్లు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పోల్స్ జాబితా అను నిత్యం వెంట ఉంచుకోవాలని, పట్టణ ప్రాంతంలో గల సమస్యలపై మున్సిపల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకోవాలని, వాటిని తప్పకుండా అమలు చేస్తామని కలెక్టర్ తెలిపారు. మాస్టర్ ప్లాన్ ను రూపొందించడం జరుగుతుందని, పట్టణ ప్రగతి లో చేయవలసిన పనులను సమీక్షించుకుని కమిటీల ద్వారా పర్యవేక్షణ చేసి ప్రజల భాగస్వామ్యంతో పనులు పూర్తి చేసుకోవాలని తెలిపారు. వార్డులో గల 600 ఇళ్లకూ మిషన్ భగీరథ ద్వారా మంచినీరు అందించాలని, ప్రతి ఇంటికి 135 లీటర్ల నీటిని అందిస్తున్నామ లేదా పరిశీలించాలని, శానిటేషన్, డ్రైనేజీ వ్యవస్థ ను మెరుగు పరచాలనీ, వార్డ్ కు సంబందించి మ్యాప్‌ను రూపొందించుకొని పనులు చేయాలని అధికారులను ఆదేశించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాష్ అభినవ్ మాట్లాడుతూ, వార్డులో ఇప్పటివరకు మంజూరు అయిన మొత్తముతో ఇప్పటి వరకు చేపట్టిన పనుల వివరాలను ప్లెక్సీ రూపంలో ప్రదర్శించాలని, స్పెషల్ డ్రైవ్ గా కార్యక్రమాలు నిర్వహించి పారిశుద్ధ్యాన్ని మెయింటైన్ చేయాలని తెలిపారు. అంతకుముందు మునిసిపల్ చైర్మన్ పాల్వాయి రాం మోహన్ రెడ్డి గత 3 విడతలుగా 19 వార్డ్ లో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ పాల్వాయి రాం మోహన్ రెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, మునిసిపల్ కమిషనర్ ప్రసన్న రాణి, తదితరులు పాల్గొన్నారు.
3 Attachments
|