ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి* ఎస్ఐ శ్రీహ

   *అలంపూర్ జనంసాక్షి (అక్టోబర్ 7)*
అలంపూర్ మండల పరిధిలో భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఎస్ ఐ  శ్రీహరి అన్నారు.గ్రామాల్లోని పాత ఇల్లు, గుడిసెలలో, శిథిలావస్థలో ఉన్న నివాసాలలో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తుంగభద్ర నది. కృష్ణ నది  తీర ప్రాంతంలో గల గ్రామాల్లో పెద్దలు తమ పిల్లలను వాగుల వైపు వెళ్ళనివ్వకుండా చూడాలని, వాగులు వంకలలో నీటి ప్రవాహంతో పొంగి పొర్లుతున్నాయిఅన్నారు. ఆయా ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని కోరా రు. మరియు పాత మిద్దెల కింద, పాత గోడల పక్కన ఎవ్వరూ ఉండకూడదు,
తడిసిన స్తంభాలను పట్టుకోవద్దు, విద్యుత్ మీటర్లను ముట్టుకోవద్దు, ఇంట్లో ఉన్న స్విచ్ బోర్డులను తాగవద్దు పొడిగా ఉన్న చిన్న కర్ర లేదా ప్లాస్టిక్ వస్తువులతో స్విచ్ వేయాలి, చిన్న పిల్లలను కరెంటు వస్తువుల దగ్గరికి పోనివ్వకండి. ఏదైనా సంఘటన జరిగితే డయల్ 100 కి కాల్ చేయలని ఎస్ ఐ శ్రీహరి శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు.
Attachments area