ప్రజలఆరోగ్యమే పట్టణ ప్రగతి లక్ష్యం కార్పొరేటర్

ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రగతి కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా చేపట్టడంజరిగిందని
వెంకటాపురం డివిజన్ కార్పొరేటర్ సబిత అనిల్ కిషోర్ అన్నారు. అల్వాల్ సర్కిల్ వెంకటపురం డివిజన్ ఇందిరా నగర్ లోని కాలనీవాసులు మంచినీటి సమస్యను మెరుగుపరచాలని సిసి రోడ్లు వేయాలని కార్పొరేటర్ కు కాలనీవాసులువినతిపత్రంఅందజేశారు. శనివారం ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వం పని చేస్తుందని పట్టణ ప్రగతితోఆధునీకరణజరగాలనేలక్ష్యంతోప్రభుత్వంపనిచేస్తుందన్నారు. డివిజన్లోని ప్రతి కాలనీ కి మంచినీటి సమస్యలు డ్రైనేజీ వ్యవస్థ విద్యుత్ వ్యవస్థను మెరుగు పరిచే విధంగ తగిన చర్యలు తీసుకుంటామని పదిహేను రోజుల నుండి పట్టణ ప్రగతి కార్యక్రమం డివిజన్లోని ప్రతి కాలనీ ప్రతి గడపకు ప్రజా సమస్యలను ఏవిధంగా పరిష్కరించాలనే ఉద్దేశంతో మున్సిపల్ అధికారులు ప్రజాప్రతినిధులు అందరం కలిసి ప్రజల అవసరాలకు అనుగుణంగా పని చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పట్టణ ప్రగతిలో భాగస్వాములై ప్రతి సమస్యను పరిష్కార మార్గంగా చేపట్టడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు డిఈ కార్తీక్ అధ్యక్షులు భాస్కర్ రావు, అనంతుల సంతోష్, సయ్యద్ మోసిన్, ముత్యాలు, సురేష్, సుదేశ్, శంకర్, సురేష్, పాషా, మైవాన్, జిహెచ్ఎంసి సిబ్బందితదితరులు పాల్గొన్నారు.