ప్రజలకు వాస్తవాలు చెప్పండి

` లేఖలు, లీకులు కాదు..
` కవితకు ఎంపి చామల సూటి ప్రశ్న
న్యూఢల్లీి(జనంసాక్షి): ఎమ్మెల్సీ కవిత బీఆర్‌ఎస్‌ గురించి వాస్తవాలు చెప్పాలని అనుకుంటే లేఖలు, లీకులు కాదని.. అందుకు అవసరమైన ఆధారాలు కవిత బయటపెట్టాలని భువనగిరి కాంగ్రెస్‌ ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి కోరారు. కేసీఆర్‌ హయాంలో పదేళ్లలో జరిగిన అవినీతిపై కవిత దర్యాప్తు కోరాలని అన్నారు. గురువారం ఢల్లీిలో కిరణ్‌ కుమార్‌ రెడ్డి విూడియాతో మాట్లాడారు. దెయ్యాలు ఎవరో కవిత బయటపెట్టాలని.. దర్యాప్తు కోరాలని చెప్పారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు కలిసి రాజకీయాలు చేస్తున్నాయని తమ నేతలు మొదటి నుంచి చెబుతునే ఉన్నారని గుర్తుచేశారు. ఈరోజు కవిత వ్యాఖ్యలు దాన్ని నిజం చేశాయని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్‌కి కవిత అవసరం లేదని.. తమకు సమర్థమైన నాయకత్వం ఉందని.. తమ పార్టీలోకి కొత్త వాళ్లు అవసరం లేదని ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి స్పష్టం చేశారు.