ప్రజలను దగా చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు

  అధికార,ధన బలంతో విర్రవీగుతే ప్రభుత్వాలకు గుణపాఠం తప్పదు.
    యం.బాల్ నరసింహ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు.
 వనపర్తి ఆగస్టు 7(జనం సాక్షి)కేంద్రంలో నరేంద్ర మోడీ సర్కార్,రాష్ట్రంలోని కేసీఆర్ ప్రభుత్వం మోసపూరిత మాయమాటలతో ప్రజలను దగా చేస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం. బాల నరసింహ విమర్శించారు. వనపర్తి పట్టణ కేంద్రంలో భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) జిల్లా ద్వితీయ మహాసభలలో ముందుగా జిల్లా మాాజీ కార్యదర్శి డి చంద్రయ్య జెండా ఎగరవేశారు. అనంతరం రెండవ రోజు ప్రతినిధుల మహాసభ వనపర్తి పట్టణం లో దాచ లక్ష్మయ్య ఫన్షన్ హాల్ లో ఆదివారం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎం బాల నరసింహ మాట్లాడుతూ ఎన్నికల ముందు కల్లబొల్లి మాటలతో అనేక ఎన్నికల్లో వాగ్దానాలు చేసి ప్రజల ఓట్లతో గద్దెనెక్కిన పాలకులు ప్రజల సంక్షేమాన్ని విస్మరిస్తూ ఓటు బ్యాంక్ రాజకీయాలకు పాల్పడుతు ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ రంగానికి కలంకం తెచ్చే విధంగా మోడీ కేసీఆర్ ప్రభుత్వాలు రాజకీయ ఆకర్ష్ లతో సంతల్లో బేరం పెట్టినట్లు ప్రజా ప్రతినిధులను అంగడి సరుకుగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం సున్నితమైన మతపరమైన అంశాలను బలవంతంగా రాజకీయా పాలన రంగంలో చూపిస్తూ భారత రాజ్యాంగ ఔన్నత్యానికి తూట్లు పొడిచే విధంగా ఎవరితో ప్రజల ఆహార అలవాట్లు కట్టుబాట్లపై ఆంక్షలు విధించడం ప్రజాస్వామ్య వ్యవస్థకే తీరని మచ్చని అన్నారు. దేశంలో ప్రశ్నించే వామపక్ష వాదులపై అభ్యుదయ వాదులపై కవులు కళాకారులు రచయితలపై దేశద్రోహం లాంటి కఠిన చట్టాలు అమలు చేస్తూ ప్రజల హక్కులను బరితెగించి హరిస్తున్నారని మండిపడ్డారు. కార్మికులు అనేక త్యాగాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను సంస్కరణల పేరుతో 40 చట్టాలను రద్దుచేసి కార్మికుల ఉసురు తీసే దివాలా కొర్ విధానాలను అనుసరిస్తున్నారని వారన్నారు.రాష్ట్రంలో కెసిఆర్ ప్రభుత్వం బిజెపి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నట్లు దోబూచులాట ఆడుతూ అంతరంగికంగా బిజెపి ప్రభుత్వానికి లోపకారి మద్దతు ఇస్తుందని అన్నారు.కేంద్ర, రాష్ట్రంలలో ఆర్టీసీ,కరెంటు,రైలు,చార్జీలతోపాటు ప్రజల నిత్యవసర వస్తువులైన వంట గ్యాస్,నూనె, పెట్రోల్,డీజిల్ ధరలను 200% పెంచి చివరకు పాల పై, చిన్నపిల్లల పెన్సిల్ ల్ల పై కూడా జీ ఎస్ టి వేసి పేద బడుగు బలహీన సామాన్య ప్రజల నడ్డి విరుస్తుందని అన్నారు.పాలకులు ధన బలంతో విర్రవీగితే రాబోయే రోజుల్లో ప్రజా పోరాటలతో ప్రజలు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. సిపిఐ 2వ రోజు ప్రతినిధుల మహాసభలో సిపిఐ జిల్లా కార్యదర్శి కె.విజయరాములు,సిపిఐ మాజీ కార్యదర్శి డి.చంద్రయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు పి.కళావతమ్మ,ఏ రాబట్టు, శ్రీరామ్,అబ్రహం, వనపర్తి పట్టణ కార్యదర్శి జి. రమేష్,నేతలు మోష, జే.చంద్రయ్య,ఏ భాస్కర్,మాషప్ప,వెంకటేష్, రవీందర్,సీఎన్.శెట్టి,భరత్,జి.మల్లేశ్,ఏ ఐ వై ఎఫ్ జిల్లా కార్యదర్శి ఎం డి.కుతూబ్,ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి వంశీ, నాగన్న,మహిళా సమైక్య నాయకురాలు గీత,తెలంగాణ ప్రజానాట్యమండలి కళాకారులు ఎస్.గోపాల్, శ్యాంసుందర్, వివిధ మండలాల నుంచి సిపిఐ ప్రతి నిధులు పాల్గొన్నారు.