ప్రజలను భాగస్వామ్యం చేయాలి
నిజామాబాద్,సెప్టెంబర్11 ( జనంసాక్షి ) : జిల్లాలోని ప్లలె సీమలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. ప్రజలకు సేవ చేయడం ప్రజా ప్రతినిధుల బాధ్యత అని ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజా ప్రతినిధులు పనిచేయాలని ముఖ్యమంత్రి ఆశించిన స్థాయిలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని శాసనసభ్యులు కోరారు. గ్రామాల అభివృద్ధికి 30 రోజులలో చేపట్టే పనులను ముఖ్యమంత్రి చేసిన దిశ నిర్దేశనికి అనుగుణంగా జిల్లాలో అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు యుద్ధప్రాతిపధికన ప్రజలతో మమేకమై నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపుతున్న జిల్లా కలెక్టర్ నాయకత్వంలో జిల్లా అధికారులు, సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు, పని చేయాలన్నారు.